టాలీవుడ్ హీరోల మధ్య సఖ్యత చాలా ఎక్కువ. అది అందరికీ తెలిసిందే, ఫ్యాన్స్ ఎలా అనుకున్నా హీరోలు మాత్రం తమలో తాము గొడవలు పడరు. వారి మధ్య విభేధాలు ఉన్నట్లుగా కూడా  ఎవరికీ తెలియవు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే తన పనేదో తన వ్యహహారం  ఏంటో అన్నట్లుగా ఉంటారు. బాలయ్య కూడా అంతే. అవసరం లేనపుడు కనీసం మీడియా ముందుకు కూడా రారు. మరి ఈ ఇద్దరి మధ్యన ఫైటింగ్ ఏంటి.. 


అదే కదా అసలు కధ‌ మరి. ఫైటింగ్ అంటే వారి మధ్య కాదు, వారి చిత్రాల మధ్యన. సంక్రాంతి  హీరో బాలక్రిష్ణ ఈసారి సెంటిమెంట్ మార్చేసి డిసెంబర్లోనే వద్దామనుకుంటున్నారు. ఈసారి ఆయన క్రిస్మస్ పండుగను టార్గెట్ చేశారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ డిసెంబర్ 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో  బాలయ్య గోదాలోకి దిగిపోయినట్లే.


మరో హీరో వెంకటేష్ తన మేనల్లుడితో కలసి నటించిన మూవీ వెంకీ మామ. ఈ మూవీని సంక్రాంతికి తీసుకువద్దామని మొదట అనుకున్నారు. కరెక్ట్ గా జనవరి 15న మూవీ రావాలని ప్లాన్ కూడా చేసుకున్నారు కానీ ఏమైందో ఏమో కానీ ఇపుడు డిసెంబర్ బెటర్ అనుకుంటున్నారుట. అంటే వెంకీ మామ కూడా క్రిస్మ‌స్ ని టార్గెట్ చేశారన్న మాట. 


ఇక డేట్ విషయంలో చూసుకుంటే సరిగ్గా  20వ తేదీనే ఈ మూవీ కూడా వస్తుందని అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ డేట్ ఇపుడు బాలయ్య మూవీకి లాక్ అయిపోయింది. అదే డేట్లో వెంకీ మామ అంటే బాలయ్య, వెంకీల మధ్య బిగ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే చాన్నాళ్ళ తరువాత ఈ ఇద్దరు సీనియర్ హీరోలు తలపడుతున్నట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: