ఈ మద్య స్టార్ హీరో సినిమాలు షూటింగ్ మొదలు థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు ఏదో ఒక తలనొప్పి వచ్చిపడుతూనే ఉన్నాయి.  ముఖ్యంగా స్టార్ హీరోల లుకింగ్ బయటకు పొక్కకుండా చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు పడుతున్నా..స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని లోకేషన్ స్పాట్ ఫోటోలు లీక్ అవుతున్నాయి.  ఆ సినిమాలో హీరో ఈ లుక్ తో కనిపించబోతున్నారా అని ఫ్యాన్స్ లో ఉన్న ఉత్సాహం నీరుగారిపోతుంది.  తాజాగా  క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, కథానాయుకుడు కమల్ హాసన్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు’. 1996లో విడుదలైన ఈ సినిమా ఓ పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  

తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక భారతీయుడు మూవీ విషయానికి వస్తే..  లంచం తీసుకునే అధికారులను కలుపు మొక్కల్లా ఏరిపారేసి అవినీతి అధికారుల గుండెల్లో వణుకు పుట్టించాడు సేనాపతి. లంచం ఇచ్చి తన తప్పు కప్పిపుచ్చుకోవాలని చూసిన సొంత కొడుకును కూడా చంపేస్తాడు.

సినిమా ముగిసే సమయానికి  ‘ఏ తప్పు జరిగినా తప్పకుండా వస్తా... భారతీయుడికి చావే లేదు.. జైహింద్‌’ అంటూ వెళ్లిపోయిన సేనాపతి వెళ్లిపోతాడు..అయితే ప్రస్తుతం దేశంలో మరోసారి అన్యాయాలు...అక్రమాలు, లంచగొండితనం పెరిగిపోతాయి..దాంతో సేనాపతి మళ్లీ వస్తాడు.  ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు.

‘ఇండియన్ 2’ పేరుతో హిందీ, తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ‘భారతీయుడు 2’ పేరుతో తెలుగులో విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్ కి సంబంధించి..కమల్ హాసన్ సేనాపతి లుక్ కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో చిత్ర యూనిట్ తలలు పట్టుకున్నారు. ఇలాంటి లీకేజీలపై ఈసారి దృష్టిపెట్టి జాగ్రత్తగా ఉండేందికు డైరెక్టర్ శంకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: