రామ్ చరణ్ ఒకప్పుడు మూస సినిమాలు చేసేవాడని విమర్శలుండేవి. కానీ ఒకే ఒక్క సినిమాతో వాటిని పోగొట్టేసాడు మెగా వారసుడు. గతేడాది ఈయన నటించిన రంగస్థలం రికార్డులు తిరగరాసింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ హీరో కనీసం సాహసం కూడా చేయని కథనంతో వచ్చింది. 


ఇక ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు ఉన్న రామ్ చరణ్ తమిళ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది. ధనుష్ హీరోగా నటించిన హిట్ సినిమా అసురన్ తెలుగులో రీమేక్ చేయనున్నాడని సమాచారం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్ చరణ్ కు మంచి హిట్ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది.


మెగా ఫామిలీలో ఒకరైన రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఆ సినిమాలోని చరణ్ పాత్ర ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమా తర్వాత మళ్ళీ రామ్ చరణ్ అటువంటి సినిమా ఎప్పుడు చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత తండ్రితో కలసి ఓ మల్టీస్టారర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్.


దాంతో పాటు అసురన్ సినిమాని కూడా చరణ్ తెలుగులో రీమేక్ చేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే రామ్ చరణ్, జంజీర్, ధ్రువ వంటి రీమేక్ సినిమాల్లో నటించాడు. మరి ఈ సినిమాకు కూడా చరణ్ ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.
మరోవైపు తండ్రి సినిమాలు కూడా నిర్మిస్తూ బిజీ అయిపోయాడు. ఇలాంటి తరుణంలో ఈయన మనసు ఓ తమిళ సినిమాల వైపు మ‌ళ్ళుతుంది. మహేష్ బాబు ఈ చిత్రం చూసి ధనుష్‌ను ఓ రేంజ్‌లో పొగిడేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: