ఈ వారం నామినేషన్స్ కోసం జరిగిన టాస్క్ లో రాహుల్ ఫైనల్ టికెట్ ని గెలుచుకున్నాడు. అయితే ఆ ఫైనల్ టికెట్ ఆలీ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల వల్ల రాహుల్ దాన్ని చేజిక్కించుకున్నాడు. అయితే ఈ టికెట్ గెలుచుకుని రాహుల్ డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఈ వారం  నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ ఫైనల్ టికెట్ గెలిచి రాహుల్ తప్పు చేశాడేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఎందుకంటే ఇప్పటి వరకు రాహుల్ ఎన్ని సార్లు నామినేషన్స్ లోకి వెళ్ళినా సేవ్ అవుతూనే ఉన్నాడు. దీనివల్ల బయట అతనికి ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ వారం నామినేషన్స్ లోకి వళ్ళి సేవ్ అయ్యి వస్తున్నాడు కాబట్టి ఈ వారం కూడా అతను సేవ్ అయ్యేవాడు. అతను నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల అతని ఫ్యాన్స్ వేరే వాళ్ళకి ఓట్లేసే పరిస్థితి ఏర్పడింది. అదీ గాక ఈ వారం జరిగే టాస్క్ లలో అతను కనిపించకుండా పోతున్నాడు.


బుధవారం జరిగిన టాస్క్ లన్నీ కేవలం నామినేషన్స్ లో ఉన్నవారికే అవడం వల్ల రాహుల్ కి పని లేకుండా పోయింది. దీంతో టాస్క్ లు ఆడిన వాళ్ళకే ఎక్కువగా పేరొచ్చింది. నామినేషన్ టాస్క్ లో ఇచ్చిన పర్ పార్మెన్స్ వల్ల బాబా భాస్కర్ హీరో ఐతే, ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఇచ్చిన టాస్క్ లో వరుణ్, బాబాలు హీరోలయ్యారు. వీరిద్దరి పట్ల జనాలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.


రాహుల్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల అతని అభిమానులు వేరే కంతెస్టెంట్ కి ఓట్లు వేస్తారు. అయితే ఈ అభిమానులు ఒకసారి ఎవరికైనా స్టిక్ అయితే వారికే ఓటేయడానికి ప్రాముఖ్యత చూపిస్తారు. దానివల్ల రాహుల్ అభిమానులు వరుణ్ కి గానీ, బాబాకి గానీ స్టిక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా రాహుల్ అభిమానులు చెల్లా చెదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఏ విధంగా చూసినా రాహుల్ ఫినాలే టికెట్ గెలుచుకుని తప్పు చేశాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: