తెలుగు లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్ తర్వాత స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2009 లో రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత తెలుగు, తమిళంలో వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ మూవీలో ప్రభాస్ సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. తర్వాత 2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు.

ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.  టాలీవుడ్ లో దాదాపు మెగా హీరోలందరి సరసన నటించింది కాజల్.  ఆ మద్య వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’లో నటించి మెప్పించింది.  సినీ పరిశ్రమకు కాజల్ పరిచయం అయి పదేళ్లు దాటినా ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది.  తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటులు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఇండియన్ సీక్వెల్ ఇండియన్ 2 రూపొందుతుంది.  ఈ మూవీలో మొదటిసారిగా కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ మూవీలో కూడా ‘సేనాపతి’ అనే పాత్ర కొనసాగనుంది... మళ్లీ వృద్ధుడిగా కమల్‌ నటిస్తున్నారు.  తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్  మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ‘ఇండియన్ 2 ’ మూవీలో తన పాత్ర గురించి ప్రస్తావించగా..భారతీయ కళలు కాపాడే పాత్ర అని చెప్పింది. కాకపోతే ఆ పాత్ర వయసు ఎంతా అని చెప్పలేదు..ఎందుకంటే ఇండియన్ మూవీలో సుకన్య ని వృద్దురాలిగా చూపించారు. మరి ఈ మూవీలో కాజల్ ని ఎలా చూపించబోతున్నారో అన్న సందేహాంలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ విషయం మాత్రం కాజల్ రివీల్ చేయడం లేదు. వచ్చే నెలలో తైవాన్‌లో చిత్రీకరణ జరుగనుంది...ఈ షూటింగ్ లో తాను కూడా పాల్గొనబోతున్నట్లు తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: