కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విజిల్. తమిళంలో బిగిల్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా భారీగా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ మూవీని మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. దాదాపు తెలుగు రెండు రాష్ట్రాల్లో 700 సెంటర్స్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. 


సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో సినిమా దర్శకుడు అట్లీ, అందులో నటించిన సహ నటులు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కు గెస్ట్ గా తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ వచ్చాడు. ఈమధ్యనే ఆయన గద్దలకొండ గణేష్ సినిమాతో హిట్ అందుకున్నారు. 


అయితే విజిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరోతో నాలుగు పాటలు.. నాలుగు ఫైట్లు పెట్టి కమర్షియల్ హిట్టు కొట్టడం చాలా ఈజీ అని.. కాని స్టార్ సినిమాలో ఓ మంచి మెసేజ్ ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. విజిల్ సినిమా ఆడవాళ్లకు అంకితమని. ఈ సినిమా ప్రత్యేకంగా మహిళా శక్తి గురించి ఉంటుందని అన్నాడు అట్లీ.


అట్లీ అన్న మాటల్లో స్టార్ హీరోలతో కమర్షియల్ హిట్టు కొట్టడం అంటే దాదాపుగా హరీష్ శంకర్ అలాంటి సినిమాలే చేస్తాడు. అట్లీ కావాలని అనకున్నా సరే అతను చేసిన కామెంట్స్ ఇన్ డైరెక్ట్ గా హరీష్ శంకర్ కు తగిలాయని కొందరు అంటున్నారు. అయితే కమర్షియల్ హిట్ అయినా ఎలా పడితే అలా తీస్తే మాత్రం హిట్ అవుతుందా చెప్పండి. ఎలాంటి కథ అయినా సరే హరీష్ శంకర్ సినిమా చేస్తున్నాడు అంటే పక్కా హిట్ అన్న నమ్మకం ఉంటుంది. ఇదే ఈవెంట్ లో హరీష్ శంకర్ మహేష్ కోనేరు నిర్మాణంలో సినిమా ఎనౌన్స్ చేయడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: