ముఖ హిందీ బుల్లి తెర నటుడు సిద్దార్థ్ శుక్లాపై బాలీవుడ్ మొత్తం కోపంగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో సిద్ధార్థ్ పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో మరో మహిళా కంటెస్టెంట్‌ను ముట్టుకోబోయాడట. దాంతో నానా రచ్చ మొదలైంది. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు సాంప్ సీడీ అనే టాస్క్ ఇచ్చారు. దేవోలినా అనే కంటెస్టెంట్ తన టీంతో కలిసి నిచ్చెన పేర్చుతుంటే సిద్ధార్థ్ టాస్క్ పాడుచేయడానికి ప్రయత్నించాడు. దాంతో దేవోలినా సిద్ధార్థ్‌పై రుస రుసలాడింది. అంతేకాదు తనను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీటూ ఆరోపణలు చేసి మరి నీ మీద కేసు పెడతానంటు బెదిరించింది. దాంతో ఈ ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇక సిద్ధార్థ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన రోజే ఒక అమ్మాయితో గొడవపడ్డాడు.  

హౌస్‌లోని ఇతర ఆడవాళ్లతో కూడా సిద్ధార్థ్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా ఓ బుల్లి తెర నటి సిద్ధార్థ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ‘బాలికా వధు’ సీరియల్‌తో పాపులారిటీ తెచ్చుకున్న సిద్ధార్థ్.. ఇదే సీరియల్‌లో తనకు భార్యగా నటించిన షీతల్ ఖందేల్ అనే నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె మీడియా ముందు బయటపెట్టింది. సెట్‌లో షూటింగ్ నెపంతో తనను ఎక్కడపడితే అక్కడ పట్టుకున్నాడని వాపోయింది. దాంతో బాలీవుడ్ ప్రముఖులు సిద్ధార్థ్‌ను బిగ్ బాస్ నుంచి తప్పించాలని, ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దేవోలినా మీటూ పేరుతో సిద్దార్థ్‌ను బెదిరించడం కూడా వివాదాస్పదమవుతోంది. మీటూ పేరు చెప్పగానే అందరూ తనని నమ్మేస్తారనుకుని అనవసరంగా ఈ ఉద్యామన్ని మిస్యూస్ చేసుకోవాలని చూస్తోంది. తెలుగులో ప్రసారమైన 'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' సీరియల్‌లో దేవోలినా గోపిక పాత్రతో బాగా పాపులర్ అయింది. ఈ సీరియల్ తెలుగులోనూ ఏడేళ్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా రన్నయింది. ఆమెకున్న పాపులారిటీ చూసి సల్మాన్ బిగ్ బాస్‌లో అవకాశం ఇచ్చాడు. కానీ దేవొలినా మీటూను తన వ్యక్తిగత విషయాల కోసం వాడుకోవాలని చూస్తుండటంతో అందరు ఆమెను తిట్టిపోస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: