తమ్మూ బేబీ దుమ్ము దులిపితే ఏ రేంజిలో ఉంటుందో తెలిసిందే. అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పటికింకా ముప్పయిల్లో ఉన్న తమన్నా ఎప్పటికీ తన అందం వసి వాడదని ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. తమన్నా అధ్బుతమైన డ్యాన్సర్, దాంతో వయ్యారాలు ఎలా వలకబోయాలో కూడా ఆమెకే తెలుసు అందుకే తమ్మూకి ఇప్పటికీ కూడా డిమాండ్ ఎక్కడా తగ్గలేదు. ఆమె ఇపుడు టాలీవుడ్లో చాలామందికి బెస్ట్ ఆప్షన్ గా ఉంది.


ప్రస్తుతం షూటింగ్ చివరి దశంలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సరిలేవు నీకెవ్వరు లో ఇంట్రో సాంగ్ కోసం తమ్మూని సంప్రదిస్తున్నారుట. ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తమ్మూతో ఇదే ఏడాది చేసిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అయింది. అందులో తమ్మూ అందాలను రెచ్చగొట్టేలా చూపించిన అనిల్ ఇపుడు మరో మారు తమ్మూనే అంటున్నాడు.


ఈ మూవీలో మహేష్ బాబు తో వచ్చే ఫస్ట్ సాంగ్ తమ్మూదే అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని నమ్ముతున్న అనిల్ దాని కోసం బాగా మసాలా కూడా రెడీ చేసి పెట్టాడుట. ఇక ఆగడు మూవీలో మహేష్ తమ్మూ ఇద్దరు హీరో హీరోయిన్లుగా మెరిశారు. ఏ మూవీలో సాంగ్స్  విజువల్ గా బాగా హిట్. 


ఇపుడు ఈ కాంబో రిపీట్ చేయడం ద్వారా తన మార్క్ మ్యాజిక్ ని అనిల్ చెప్పాలనుకుంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి  తగినట్లుగా సరిలేరు నీకెవ్వరు అన్ని హంగులతో తయారు చేస్తున్నారు.    మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా  అందగాడూ, చందురూడూ, మరో మారు ఈ జంట కన్నుల పంట అవుతుందేమనని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. మరి చూడాలి తమ్మూ దుమ్ము దులుపుడు వెండి తెర మీద ఎలా పండుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: