అల్లు అర్జున్ తెలివిగా తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాలు ఒప్పుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా బన్నీ నటించిన సినిమా మలయాళంలో విడుదల అవుతుందంటే అక్కడ స్టార్ హీరోలు కూడా బన్నీ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి కొంత భయపడతారు. ఆ విధంగా బన్నీ ఒక సౌత్ ఇండస్ట్రీ లోనే కాక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కూడా దుమ్ము దులుపుతున్నరు. తన సినిమాలకు సంబంధించిన టీజర్లు...సాంగ్స్ రిలీజ్ చేసి సోషల్ మీడియా కింగ్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “అల వైకుంఠపురములో” అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే.


ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా మ్యూజిక్ ఎస్ ఎస్ థమన్ సమకూరుస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన స్టామినాను నిరూపించుకుని మరోసారి సోషల్ మీడియా కింగ్ అని అనిపించుకున్నాడు. ఫస్ట్ సాంగ్ గా ఈ సినిమా నుండి సోషల్ మీడియా లో విడుదలైన సామజవరగమన సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఫస్ట్ రోజే ఫాస్టెస్ట్ లైక్స్ వ్యూస్ రికార్డులు నెలకొల్పిన ఈ పాట ఆ తర్వాత కూడా తెలుగులో ఏ సాంగ్ కి రానన్ని లైక్స్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది.


కానీ ఇప్పుడు ఏకంగా 50 మిలియన్ వ్యూస్ రాబట్టి అసలు టాలీవుడ్ ఏ హీరో ఖాతాలో కూడా పడని సాలిడ్ రికార్డు అల్లు అర్జున్ ఖాతాలో పడింది. ఇప్పటికే యూట్యూబ్ సహా సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో అల్లు అర్జున్ కు ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రికార్డు నెలకొల్పడం తో సోషల్ మీడియాలో కూడా బన్నీకి తిరుగులేదు అని ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అంటున్నారు. పాటల పరంగా ఇంతగా అలరిస్తున్న “అల వైకుంఠపురములో”... సినిమా పరంగా ఏ విధంగా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: