విశాల్-సమంత హీరో హీరోయిన్స్‌గా తమిళంలో 'ఇరుంబుతిరై'(తెలుగులో 'అభిమన్యుడు') సినిమా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు పీఎస్ మిత్రన్. ఈయన డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన తాజా తమిళ సినిమా 'హీరో'. ఈ సినిమా థియోట్రికల్ ట్రైలర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీసెంట్ గా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్.. ఇవానా.. యాక్షన్ కింగ్ అర్జున్.. బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను సూపర్ హీరో కం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. 

ఒకటిన్నర నిముషం టీజర్ లో స్టొరీ లైన్ ని అలా అలా చెప్పారు. అర్జున్ ఒక సీన్ లో హీరో శివకార్తికేయన్ తో "ఇక్కడ ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం దక్కుతుంది. కానీ అందరికీ సాధించే అవకాశం దొరకదు. ఈ వ్యవస్థను మార్చాలంటే కామన్ మ్యాన్ సరిపోడు.. ఒక హీరో కావాలి" అని చెప్తాడు. దీన్ని బట్టి వ్యవస్థను మార్చేందుకు శివకార్తికేయన్ హీరో అవతారం ఎత్తుతాడని తెలుస్తుంది. ఇక విలన్ పాత్రలో అభయ్ డియోల్ "నీ పని నువ్వు చూసుకో- ఇదే మన విద్యా వ్యవస్థ విద్యార్థులకు నూరిపోసేది" అంటాడు. సో ఇక్కడ మనకి ఈ సినిమాని శంకర్ యాక్షన్ కింగ్ అర్జున్ తో తీసిన జెంటిల్ మాన్ సినిమా లా ఉంటుందనిపిస్తుంది. 

ఒక సామాజిక అంశాన్ని తీసుకుని వ్యవస్థను బాగుచేయడం కోసం ఒక సూపర్ హీరో శ్రమించడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ని యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో గనక పక్కాగా ప్రెజెంట్ చేస్తే మాత్రం హిట్టు గ్యారెంటీ. టీజర్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. స్టార్ కాస్ట్ తో పాటు యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఈ సినిమాతో శివకార్తికేయన్ కి భారీ హిట్ దక్కడం గ్యారెంటీ అని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: