దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, అరణ్యం, దళం, ఛలో అసెంబ్లీ, ఒరేయ్ రిక్షా, హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌, అన్నదాతా సుఖీభవ..ఇలా దాదాపు 40 సినిమాలను అందించి పీపూల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి. అయితే ప్రస్తుతం మూర్తి గారి సినిమాలు బాగా తగ్గిపోయాయి. అయిప్పటికీ తన పంథాలోనే బడుగు బలహీన వర్గాల కోణంలో కథల్ని ఎంచుకుని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. విప్లవం ఉద్యమం గిరి పుత్రులు అంటూ ఆయనకంటూ ఉన్న ఒక జోనర్ ని ఎప్పటికీ వదలరు. 37 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఎప్పుడు ఆయన నమ్మిన సిద్దాంతాలను మాత్రం వదలలేదు. అందుకే ఆర్ నారాయణమూర్తి సినిమాలంటే అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు, ఆసక్తి. ఇక సినిమాలు తగ్గిన నేపథ్యంలో నారాయణమూర్తి కి ఎంతో మంది దర్శకులు అవకాశాలిచ్చిన సందర్భాలున్నాయి. 

కానీ ఆయన మాత్రం సున్నితంగానే వాటిని తిరస్కరించారు. అలా మూర్తిగారికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళలో స్టార్ డైరెక్టర్ పూర్తి జగన్నాథ్ కూడా ఉండటం విశేషం. 
పూరి.. తారక్ తో తీసిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణ మురళి పోషించిన కానిస్టేబుల్ పాత్రకు ముందుగా ఆర్. నారాయణమూర్తినే పూరి అనుకున్నారు. మూర్తిగారిని దృష్టిలో పెట్టుకునే ఆ రోల్ ని అంత పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు పూరి చాలా ఇంటర్వూల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ గొప్ప అవకాశాన్ని నారాయమణమూర్తి సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఆయన మీద సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి కూడా. సినిమా అవకాశాలు లేకపోయినా నారాయణమూర్తి ఎందుకు అంత బెట్టు గా ఉంటారని విమర్శించిన వాళ్ళున్నారు. 

అలాంటి రోల్ నారాయణమూర్తి ఎందుకు ఆ రోజు అంగీకరించలేదో తెలిపారు. పూరీని టెంపర్ ని పొగిడేసిన మూర్తిగారు .. తను ఆ పాత్రను చేయలేనని అన్నారు. 
పూరి మంచి దర్శకుడు. అయితే ఆయన తీసిన టెంపర్ సినిమాలో నటించకపోవడానికి ఒక కారణం ఉంది. ఇప్పటివరకూ నేను హీరో ఓరియేంటెడ్ రోల్స్ మాత్రమే చేసాను. తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర చేయడానికి ఎందుకనో నా మనసు ఒప్పుకోలేదు. అంతే తప్ప పూరి ఆఫర్ ని గర్వం తలకెక్కి తిరస్కరించలేదని క్లారిటి ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే నారాయణమూర్తి ఇంకా కొంతకాలం హీరోగానే సినిమాలు చేయాలనుకుంటున్నట్లు అర్థమవుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: