బుల్లితెర యాంకర్ అనసూయ ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తుంది. తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ ను వాడుకుంటున్న అనసూయ రోజు రోజుకి సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. జబర్దస్త్ యాంకర్ గా తన అందంతో అలరిస్తున్న అమ్మడు అటు సినిమాలు ఇటు బుల్లితెర షోలు కాకుండా అడపాదడపా ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది.


రీసెంట్ గా నైట్ మోడ్ లో స్లీవ్ లెస్ డ్రెస్ తో అనసూయ అందాలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. పెళ్లైతే గ్లామర్ ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు రావని అనుకునే వారికి అనసూయ లాంటి వారు పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లి అన్న ఫీలింగ్ ఎక్కడ కనబడనివ్వదు. అందుకే అనసూయకు అంత క్రేజ్.


ప్రస్తుతం తెలుగులో ఉన్న హాట్ యాంకర్స్ లో అనసూయ టాప్ పొజిషన్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా తన నెటి మోడ్ లోని గ్లామర్ షో చూస్తే ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా ఏం పనికి వస్తారన్న భావన రాక మానదు. అనసూయలోని ఈ గ్లామరే తనకు అవకాశాలు తెచ్చి పెడుతుంది. కేవలం గ్లామర్ మాత్రమేనా రంగస్థలం లో రంగమ్మత్త పాత్రల్లో అమ్మడు అదరగొట్టింది.


గ్లామర్ తో గాలెం చేస్తూ.. వచ్చిన ఛాన్సుల్లో విజృభించడం అమ్మడికి బాగా అలవాటుగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఓ సగటు హీరోయిన్ మాదిరిగా అనసూయ చేస్తున్న ఈ గ్లామర్ షో ఏదో ఒక రోజు హీరోయిన్ గా మంచి ఛాన్స్ కొట్టేస్తుందని అంటున్నారు. రీసెంట్ గా అనసూయ లీడ్ రోల్ లో చేసిన కథనం మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: