నందమూరి బాల‌క్రిష్ణ 105వ సినిమా టైటిల్ ని రూలర్ గా డిక్లేర్ చేస్తూ  ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.  దీపావళి  పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ టైటిల్ ని ప్రకటించింది. ఇప్పటి వరకూ వర్కింగ్ టైటిల్ గా ఉన్న రూలర్ కాస్త ఇపుడు అధికారికంగా ఖరారు చేశారు. దీని కోసం అననేకా రకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ బాలయ్య బాడీ లాంగ్వేజ్, ఆయనకు సినిమాలో ఉన్న క్యారక్టర్ పరంగా రూలర్ కచ్చితంగా సరిపోతుందని భావించి ఎట్టకేలకు ప్రకటించారు.


ఇదిలా ఉండగా రూలర్ టైటిల్ ఇంతకు ముందే ఫ్యాన్స్ లోకి  బాగా వెళ్ళిపోయింది. ఈ టైటిల్ చాలా పావర్ ఫుల్ గా ఉందని, దాన్ని పెట్టాలని అభిమానుల నుంచి ఎన్నో విన్నపాలు కూడా వచ్చాయి. మొత్తానికి వారి కోరికే నేరవేరింది. ఇదిలా ఉండగా రూలర్ ఫస్ట్ లుక్ లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా ఆవేశం చూపుతూ ఉన్న ఫోటో అదరహో అన్నట్లుంది.


ఇది నిజానికి బాలయ్య అభిమానులకు కన్నుల పంటే అని చెప్పాలి. గత కొంతకాలంగా హిట్లు లేక బాలయ్య ఇబ్బంది పడుతున్నారు. అభిమానులు సైతం బాలయ్యకి ఒక హిట్ కోరుకున్నారు. అయితే దానికి తగినట్లుగ రూలర్ అంటూ పవర్ ఫుల్ గా నందమూరి అందగాడు రావడంతో దీపావళికి ముందే బాణా సంచా కాల్చినట్లుగా ఉందంటున్నారు.


ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలయ్య్య పక్కన సోనాలీ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలయ్య రెండు డిఫ‌రెంట్ షేడ్స్ తో  ఈ మూవీలో కనిపిస్తారని అంటున్నారు. డిసెంబర్లో వస్తున్న ఈ మూవీ నందమూరి అభిమానులకు పండుగే పండుగ అంటున్నారు. బాలయ్య సెంటిమెంట్ అయిన పోలీస్ డ్రెస్ ఉన్నందున ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అంటున్నారు. బాలయ్య పోలీస్ పాత్రల సినిమాలు  బ్లాక్ బస్టర్ హిట్టేనని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: