నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ రూలర్ అని పెట్టారు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక నటిస్తున్నారు. సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాలో బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. 


దీపావళి కానుకగా బాలకృష్ణ 105వ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న రూలర్ టైటిల్ నే ఫైనల్ చేశారు బాలకృష్ణ. బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాలో రూలర్ అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ టైటిల్ కోసం నందమూరి హీరోలు పోటీ పడ్డారు. 


ఫైనల్ గా బాలయ్య బాబుకి రూలర్ టైటిల్ దక్కింది. పవర్ ఫుల్ టైటిల్ తో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సిం హం లా గర్జిస్తున్న బాలయ్య షాక్ ఇవ్వగా రిలీజ్ డేట్ చూసి వారు అవ్వక్కవుతున్నారు. 2020 సంక్రాంతి రేసులో ఉంటాడా లేక సినిమా వాయిదా వేస్తాడా అనుకుంటున్న టైంలో సడెన్ గా డిసెంబర్ 20న రిలీజ్ అంటూ పోస్టర్స్ వదిలారు.


ఆల్రెడీ డిసెంబర్ 20న సాయి తేజ్ ప్రతిరోజు పండుగే.. అనుష్క నిశ్శబ్ధం.. రవితేజ డిస్కో రాజా కూడా ఆ డేట్ రిలీజ్ లాక్ చేసుకున్నారు. అయితే సడెన్ గా బాలయ్య బాబు వచ్చి తన సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది ముందుకు ఏది వెనక్కి జరుగుతుందో చూడాలి. జై సిం హా తర్వాత కె.ఎస్ రవికుమార్ బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మరి డిసెంబర్ క్రిస్ మస్ రేసులో బాలయ్య హిట్టు కొడతాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: