ఈ తరం కుర్రకారులో కాజల్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాలోనూ తన అందంతో జనాలను కట్టిపడేస్తుంది. దాదాపుగా ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ గ్లామర్ కు ప్రాధాన్యం ఉన్నవే. అలాంటి ఒక నటి డీ గ్లామరస్ రోల్ చేస్తుంది అంటే  ఆశ్చర్యం అనే చెప్పాలి. కాజల్ కూడా ముందెప్పుడు డీ-గ్లామర్ గా కనిపించే పాత్రలు చేయలేదు. మొన్న' సీత ' సినిమా లో కూడా పాత్ర కు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసినా కూడా గ్లామర్ గానే కనిపించింది. బహుశా ప్రేక్షకులు కూడా తనని అలాగే ఆదరిస్తున్నారు ఏమో. ఒక విధంగా చెప్పాలంటే తనకు ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టడానికి కారణం కూడా తన గ్లామరే.

ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భారతీయుడు 2' లో కాజల్ కథానాయికగా గా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కమలహాసన్ హీరో. అలాగే రెండో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంచుకున్నారు శంకర్. భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా లో 90 ఏళ్ల ముసలి వ్యక్తి పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. అయితే ఇక్కడ ఆ 90 ఏళ్ల వ్యక్తికి జోడి గా కాజల్ ను 85 ఏళ్ల బామ్మగా చూపించబోతున్నారట. అలాంటి పాత్రలో కాజల్ కనిపిస్తే ప్రేక్షకులు ఎలా జీర్ణించుకుంటారో.

భారతీయుడు సినిమా లో 80 ఏళ్ల బామ్మగా అప్పటి హీరోయిన్ సుకన్య కనిపించినా తనకు అంతగా క్రేజ్ లేదు కాబట్టి పెద్దగా సమస్య లేదు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కాజల్ ఇలాంటి పాత్ర చేస్తే అభిమానులు చూస్తారా..?ఎప్పుడూ తన అందాలతో తన అభిమానులను ఉర్రూతలు ఊగించే కాజల్ ఇప్పుడు ఇలాంటి డీగ్లామరస్‌ రోల్ చేయడం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. బహుశా తాను గ్లామర్ రోల్స్ కే పరిమితం కాదు మంచి నటి కూడా అని అనిపించుకోవాలి అని ఈ పాత్ర ఒప్పుకుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: