క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రానికి సూప‌ర్‌మ‌చ్చి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.  వ‌ర్షంలో స్నేహితుల న‌డుమ హీరో క‌ల్యాణ్‌దేవ్ న‌వ్వుతూ ఉండే లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.


బాలీవుడ్ బ్యూటీ రెహ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానున్న శ్రీవిష్ణు `తిప్ప‌రామీసం` చిత్రాన్ని నిర్మించిన రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుత‌న్న చిత్ర‌మిది.


గ‌తంలో ఈయ‌న న‌టించిన చిత్రం ‘విజేత’. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకం పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం తండ్రి, కొడుకుల మధ్య నడిచే ఈ సినిమాలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అల్లరి చిల్లరగా తిరిగే యువకుడి పాత్రలో న‌టించాడు. దీంతో ఆ తండ్రికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు అనేది మిగతా కథ. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక మ‌రి ఈ రెండో చిత్రం క‌థాంశం ఏమిటి ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటాడు అన్న‌తి తెలియాల్సి ఉంది.


క‌ల్యాణ్‌దేవ్‌, రెహ చ‌క్ర‌వ‌ర్తి, నరేశ్ వి.కె, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  పులి వాసు, నిర్మాత‌:  రిజ్వాన్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  ఖుషి,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌నోజ్ మావెళ్ల‌, మ్యూజిక్‌:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్,  కెమెరా:  శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌, ఆర్ట్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి, పాట‌లు:  కెకె.


మరింత సమాచారం తెలుసుకోండి: