ఒకప్పుడు సొంత అన్న కొడుకైనా సరే సరిగ్గా పట్టించుకోని బాలకృష్ణ ఈ మధ్య బాగా చుట్టరికం కలుపుకొని మరి తెగ కలసి పోతున్నాడట జూనియర్ ఎన్టీఆర్ తో.నందమూరి బాబాయ్ అబ్బాయి మధ్య సంబంధాలు ఇప్పుడు బాగానే ఉన్నాయి. హరికృష్ణ మరణం తర్వాత అన్న కొడుకులను దెగ్గరకు తీసుకున్న బాలకృష్ణ .ఇప్పుడు అన్ని బాధ్యతలు తానే తీసుకున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ అరవింద సమేత ఫంక్షన్ లో గాని ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలకు గాని తానే స్వయంగా వచ్చి ఆశీర్వదించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్ బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకు వచ్చి అందరిని ఆశ్చర్య ఛలోక్తి కి గురి చేసాడు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగ ట్రీట్ ఇచ్చాడు బాలయ్య బాబు ఈయన కొత్త సినిమా లుక్ విడుదల చేసి వైరల్ గా మార్చాడు. దానికి ఎన్టీఆర్ కి ఏంటా సంబంధం అనుకుంటున్నారా...ఉంది అండి ఖచ్చితంగా ఉంది.


ఈ చిత్ర టైటిల్‌లోనే ఉంది అసలు మజా అంతా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమాకు రూలర్ అనే టైటిల్ కన్ఫర్మ్  చేసుకున్న చిత్ర బృందం. ఈ లుక్ కూడా ఇప్పుడు వైరల్ చేశారు. మరోసారి బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ పాత్ర పోషిస్తూ చేసిన సినిమా గా అనిపిస్తున్న ఈ మూవీ రులర్ అనే  టైటిల్‌తో వచ్చాడంటూ దీపావళి పండుగ ముందే చేసుకున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రం. ఇదిలా ఉంటే జూనియర్ ఫ్యాన్స్ కూడా బాలయ్య టైటిల్‌తో ఖుషీ అవుతున్నారు.


దానికి కారణం ఈ టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ పాట నుంచి తీసుకోవడమే అంటున్నారు అభిమాన సంఘ నాయకులు అబ్బాయి నటించిన దమ్ము సినిమాలోని పాట ఇది అంటూ నెటిజన్లు ఒక్కంత షాక్ కి గురి అయ్యారు.రూలర్ అంటూ అప్పట్లో మోత మోగించిన సంగతి అందరికీ తెలిసందే అదే పాటలోని పదాన్ని ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రానికి టైటిల్ కార్డ్ గా పెట్టి ఆశ్చర్య పరిచారు చిత్ర యూనిట్. దాంతో అందరి చూపు హిట్ మీదనే పడింది.చూద్దాం హిట్ కొట్టనున్నారో లేదో...


మరింత సమాచారం తెలుసుకోండి: