ఏ టైంలో ఛలో ఆఫర్ ఓకే చేసిందో ఏమో కాని అప్పటి నుండి రష్మిక ఫేట్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో పాపులర్ అయిన ఈ అమ్మడు తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమాతో రష్మికకు మంచి పేరు వచ్చింది. ఇక సెకండ్ మూవీ గీతా గోవిందం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.   


విజయ్ దేవరకొండకు పర్ఫెక్ట్ పెయిర్ గా రష్మిక అదరగొట్టింది. ఇక ఆ తర్వాత దేవదాస్ సినిమా నిరాశ పరచినా విజయ్ తో మళ్లీ డియర్ కామ్రేడ్ అంటూ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది రష్మిక మందన్న.


మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే మాములు విషయం కాదు.. హీరోయిన్ గా ఇప్పటికే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మహేష్ ఛాన్స్ తో టాప్ రేంజ్ కు వెళ్లింది. ఈ సినిమాలో రష్మిక లుక్ ఎలా ఉంటుందని ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. దీపావళి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా రష్మిక లుక్ రివీల్ చేశారు.


పెళ్లిచూపులకు రెడీ అవుతున్న రష్మిక సిగ్గు పడుతూ నవ్వుతున్న పోస్టర్ ఈరోజు వచ్చింది. పైన మహేష్ కూడా తన లుక్ తో సర్ ప్రైజ్ చేయగా రష్మిక కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కచ్చితంగా ఈ ఇద్దరి జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు. 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా బన్ని అల వైకుంఠపురములో సినిమాకు గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: