టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఇటీవల గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా యావరేజ్ సినిమాగా నిలిచింది. మెగాస్టార్ అత్యద్భుత నటనతో సినిమాను ముందుకు నడిపించినప్పటికీ, ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో ఈ సినిమాను మెజారిటీ ప్రేక్షకులు ఆదరించలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే పై మరింతగా శ్రద్ద పెట్టి ఉంటె, ఖచ్చితంగా సైరా సూపర్ హిట్ కొట్టి ఉండేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

ఇకపోతే ఇప్పటికే క్లోసింగ్ దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాత రామ్ చరణ్ కొన్ని సంచలన విషయాలు నేడు కొన్ని పత్రికలతో పంచుకున్నారు. సైరా సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంది అనే విషయం అటుంచితే, నాన్న గారి చిరకాల కోరిక దీని ద్వారా తీరిందన్న ఆనందం తనకు ఎంతో ఉందని అన్నారు చరణ్. ఇక ఈ సినిమా కోసం దాదాపుగా రూ.8 కోట్ల వ్యయంతో ఒక సాంగ్ ని ఎంతో భారీ లెవెల్లో చిత్రీకరించాం అని, అయితే ఎందుకో ఆ సాంగ్ సినిమాకు అవసరం లేదనిపించి ఎడిటింగ్ లో చివరికి తీసేశామని షాకింగ్ గా చెప్పారు. ఇకపోతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఒకింత బాగానే రాబట్టిన ఈ సినిమా, నార్త్ లో మాత్రం చాలా తక్కువ స్థాయిలో పెర్ఫార్మ్ చేయడానికి అదే రోజున రిలీజ్ అయిన వార్ సినిమానే కారణం అని అన్నారు చరణ్. 

అయితే అనుకోకుండా తమ సినిమా కూడా వార్ రిలీజ్ రోజునే విడుదల తేదీ నిర్ణయం కావడం సైరాకు కొంత సమస్యగా మారిందని, అదీకాక వార్ సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో, అక్కడ సైరాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదని చరణ్ చెప్పడం జరిగింది. ఇక మెగాస్టార్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో త్వరలో తెరకెక్కబోయే సినిమాలో తాను ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చరణ్ కొట్టి పారేశారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: