పండుగ అంటేనే కుటుంబ సభ్యులు కలవడం.. రోజువారీ పనుల ఒత్తిడిలు ఎప్పుడు ఉండనే ఉంటాయి. అందుకే పండుగ వచ్చినప్పుడు అయినా కనీసం అందరు కలవాలని అనుకుంటారు. ఈ విషయంలో స్టార్స్ తమ ఫాన్స్ కు మంచి మెసేజ్ ఇస్టంటారు. ముఖ్యంగా పండుగ ఏదైనా మెగా ఫ్యామిలీలో సందడి మాములుగా ఉండదు. 

 

లేటెస్ట్ గా వచ్చిన సైరా హిట్ అవడంతో ఈ దీపావళి మరింత కలర్ ఫుల్ గా జరుపుకున్నారని తెలుస్తుంది. ఇక దీపావళి అంటేనే క్రాకర్స్ ఇంకా టపాసులు పేల్చడం. ఈ పండుగని మెగా ఫ్యామిలీ అందరు కలిసి జరుపుకుంటారట. ఈ ఇయర్ దీపావళి కూడా అంగరంగ వైభవంగా జరిగిందట.  రామ్ చరణ్ తను టపాసులు కాల్చడంలో వెనుక ఉంటానని చెప్పాడు. 

 

టపాసులు పేల్చడం లో బన్నీ అందరి కన్నా ముందు ఉంటాడట. మా అందరిలో బన్నీనే  టపాసులు కాల్చటం లో బాగా ఎంజాయ్ చేస్తాడని చరణ్ అంటున్నాడు. అంతేకాదు ఫ్యామిలీ అంతా మీట్ అయ్యేది చిరు ఇంట్లోనే అందుకే స్పెషల్ గా చిరంజీవి చిరు దోస అందరికి ఆయన స్వయంగా సర్వ్ చేస్తాడట. 

 

ఇలా ప్రతి సంవత్సరం అందరు కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటారట. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా రి యూనియన్ అయిన ఒక పిక్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. అది ఇప్పటిదేనా కాదా అన్నది తెలియదు కాని అందులో మెగా హీరోలంతా ఉన్నారు. బన్నీ కూడా ఉండటం విశేషం. మెగా ఫ్యామిలీ దీపావళి మెగా ఫాన్స్ అందరికి సర్ ప్రైజ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: