కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీ తెలుగు రీమేక్ దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అయితే జరుపుకుంటుంది కాని సినిమాకు సంబందించిన అప్డేట్స్ మాత్రం బయటకు రానివ్వట్లేదు. ఈమధ్య సమంత ఈ సినిమా లో నటించడం ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకొచ్చింది.

 

96 తమిళ సినిమాకు తెలుగులో కూడా సూపర్ ఫాన్స్ ఉన్నారు. అసలైతే సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. డిసెంబర్ లో చేయాలంటే ఈ పాటికి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సిందే. అయితే డిసెంబర్ రేసులో 96 రీమేక్ జానూ రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువే అనిపిస్తుంది.

 

 సూపర్ హిట్ సినిమా రీమేక్ చేస్తూ ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారు సినిమా మేకర్స్. 96 తెలుగు రీమేక్ ను కూడా మాతృక దర్శకుడు ప్రేమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ్ లో క్రియేట్ అయిన మేజిక్ తెలుగులో కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలి. శర్వానంద్,  సమంతలు మాత్రం ఈ సినిమా విషయంలో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారని తెలుస్తుంది.

 

మరి ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. డిసెంబర్ మిస్ అయితే జనవరి లో ఎలాగూ కుదరదు కాబట్టి కచ్చితంగా ఈ మూవీ ఫిబ్రవరి లోనే రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా లీడ్ పెయిర్ ఇద్దరికీ కెరీర్ లో మిగిలిపోయే సినిమా అవుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: