సరిలేరు నీకెవ్వరు హిట్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి పెద్దగా కష్టపడటం లేదు. తపస్సులా.. యజ్ఞంలా సినిమాను తీయడం లేదు. సింపుల్ గా బలమైన సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నాడు. హీరో మహేశ్ విషయంలోనే కాదు.. ముఖ్యపాత్రలో కనిపించనున్న విజయశాంతి విషయంలోనూ.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. 


13సంవత్సరాల విరామం తర్వాత విజయశాంతి సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ పేరు ఆమెకు బాగా కలిసొచ్చింది. భారతి పేరుతో నటించిన భారతానారి, నేటి భారతం హిట్ కావడంతో.. దర్శకుడు అనిల్ రావిపూడి ఇదే పేరును రిపీట్ చేశాడు. 


సెంటిమెంట్ ప్రకారమే.. సరిలేరు నీకెవ్వరులో మహేశ్ అజయ్ కృష్ణ పేరు పెట్టాడు అనిల్ రావిపూడి. సూపర్ స్టార్ కు బాగా కలిసొచ్చిన పేరు ఇది. రెండు హిట్ సినిమాల్లో మహేశ్ పేరులో అజయ్ ఉండటంతో మహేశ్ పేరులో అంజయ్ ఉండేలా జాగ్రత్తపడ్డాడు. 


మహేశ్ స్టార్ డమ్ తీసుకొచ్చిన చిత్రం ఒక్కడులో మహేశ్ అజయ్ వర్మగా నటించాడు. మరో బ్లాక్ బస్టర్ దూకుడులో మహేశ్ బళ్లారి బాబుగా.. అజయ్ కుమార్ గా రెండు షేడ్స్ లో నటించాడు. సరిలేరు నీకెవ్వరులో మహేశ్ కు కలిసొచ్చిన అజయ్ పేరును పెట్టడమే కాదు.. తండ్రి పేరు కూడా యాడ్ చేశాడు దర్శకుడు. పోకిరిలో కృష్ణ మనోహర్ గా నటించిన మహేశ్.. సరిలేరు నీకెవ్వరులో అజయ్ కృష్ణగా ముందుకొస్తున్నాడు. మొత్తానికి దర్శకుడు అనిల్ రావిపూడి కేవలం పేర్లలో సెంటిమెంట్ ఫాలోఅయి హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఉన్నాడు. నిజంగా గతంలోలాగే ఈ నేమ్స్ సరిలేరు నీకెవ్వరును హిట్ బాట పట్టిస్తాయో లేదో  చూడాలి.  కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి.. తిరిగి మహేశ్ బాబు సినిమతో రీఎంట్రీ ఇవ్వడంతో సినీ ప్రేక్షకులు సరిలేరు నీకెవ్వరుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాములమ్మ అప్పటిలాగే మెప్పిస్తుందా.. లేక ఇంకొంచెం డోస్ పెంచుతుందా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: