బిగ్ బాస్ షో ఇంకో వారం రోజుల్లో పూర్తి అవుతుంది. ఆదివారం అందరూ అనుకున్నట్టుగానే శివజ్యోతి ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన వారిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది చర్చగా మారింది.
ఇక పోతే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ హౌస్ కి వచ్చి అందరిని అలరించాడు. విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నచిత్రం "మీకు మాత్రమే చెప్తా" ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ లో మెరిసాడు.


అయితే విజయ్ కంటెస్టెంట్స్ అందరి రహస్యాలు చెప్పమని చెప్పడంతో ఒక్కొక్కరు హౌస్ లో జరిగిన రహస్యాలు చెప్పుకొచ్చారు. మొదటగా శ్రీముఖి చెప్తూ బాబా భాస్కర్ ని వేసేయాలని ఉందని చెప్పింది. ఫినాలేకి వెళ్ళిపోయాక అతను మరీ ఎక్కువ చేస్తున్నాడని, తానే టైటిల్ విన్నర్ అనేలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పింది. ఇక శివజ్యోతి మాట్లాడుతూ, శ్రీముఖి విన్నర్ అవడం తనకి ఇష్టం లేదని చెప్పింది. 


అందరిలోకి రాహుల్ చెప్పిన రహస్యం ఎక్కువ మందిని ఆకర్షించింది. రాహుల్ మాట్లాడుతూ, కాకరకాయ జ్యూస్ తాగి పునర్నవిని సేవ్ చేసిన సమయంలో ఆమె ముద్దు పెట్టింది. అది అందరూ చూసి ఉంటారు. కాని ఆమె ఒకసారి నా చేయి గట్టిగా కొరికి పారిపోయింది. చేయి కొరికి పారిపోయిన విషయాన్ని రాహుల్ చెప్పడంతో నాగార్జున గట్టిగా నవ్వారు.ఇది అందరు చెప్పిన రహస్యాల కంటే పెద్ద రహస్యం అన్నాడు. 


అదీ గాక ఆమె నన్ను తిట్టిన విషయాలు చూపించే వారు కాదు. కానీ నేను తిట్టినవి మాత్రం వచ్చేవి అన్నాడు రాహుల్ మరియు పునర్నవిల మద్య స్నేహంను మించి ఏదో ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్న విషయం తెల్సిందే. అయితే రాహుల్ మా ఇద్దరి మధ్య ఉంది స్నేహం మాత్రమేనని తాను నాకు మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: