మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్శ‌కత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శరవేగంగా హైద‌రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది..తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో S. P. బాల సుభ్రమణ్యం పాట పాడారు.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది..ఈ సాంగ్ లో లిరిక్స్ చాలా వాల్యూ తో కూడినవిగా విన్నవారంతా చెప్పటం విశేషం..అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ అతి త్వరలో విడుదల చేస్తారు..


ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్, ప్రొడక్షన్ - రామ్ తళ్లూరి, సమర్పణ - సాయి రిషిక, నిర్మాత : రజిని త‌ళ్లూరి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్, సినిమాటోగ్రాఫ‌ర్  : కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్ : అబ్బూరి రవి, మ్యూజిక్ : థ‌మన్. ఎస్, ఎడిట‌ర్ : న‌వీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి, కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి, పిఆర్ఓ : ఏలూరు శ్రీను.


మరింత సమాచారం తెలుసుకోండి: