కొత్త కాన్సెప్ట్ లు ఎప్పుడూ ప్రేక్షకుల ఆసక్తి ని పొందుతాయి. కొరియోగ్రాఫర్ ఫేమ్ అయిన సన్నీ కోమలపాటి దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మోషన్ పోస్టర్ దీపావళి సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. త్వరలో సెట్స్ మీదకు వెళుతున్న ఈ మూవీ తెలుగులో వచ్చిన థ్రిల్లర్స్ లో ప్రత్యేకంగా నిలుస్తోంది అని చిత్ర యూనిట్ అభిప్రాయం.


మూవీ లో టెక్నికల్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ లో ఉండబోతున్నాయి. తెలుగులో మొదటిసారి కెమెరాతో  షూట్ చేయబోతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఉపయోగించే కెమెరా ఈ థ్రిల్లర్ కోసం వాడుతున్నారు. స్వర బ్రహ్మ మణిశర్మథ్రిల్లర్ కి మ్యూజిక్ అందించబోతున్నారు. దర్శకుడు సన్నీ చెప్పిన కాన్సెప్ట్ కి మణిశర్మ బాగా నచ్చడం తో ఈ ప్రయత్నానికి తోడు నిలిచారు. 


గౌతమ్ కొండె పూడి, రాహుల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లోతారక్ రత్న, ప్రిన్స్ ప్రధాన పాత్రలలో కని పిస్తున్నారు. తారక్ రత్న లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. మోషన్ పోస్టర్ లో కనిపించిన లుక్ బాగా ఆకట్టుకుంటుంది. తారక్ రత్న, ప్రిన్స్, అలీ, సాయికుమార్, రఘు కారు మంచి, ఫిష్ వెంకట్, సంజయ్. త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ :మణిశర్మ, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, లిరిక్స్  : శ్రీమణి, కల్యాణ చక్రవర్తి.  


ఆర్ట్  : నాగేంద్ర, డైలాగ్స్ : కళ్యాణ్ చక్రవర్తి, కో ప్రొడ్యూసర్  : జి.ఎమ్. ఆర్‌, ఫైట్స్ : రియల్ సతీష్, విఎఫ్ఎక్స్‌: తేజ్ దిలీప్, ప్రొడక్షన్ కంట్రోలర్ : బెక్కం రవీందర్, పి ఆర్ ఓ : జి యస్ కే మీడియా, ప్రోడ్యూసర్స్: గౌతమ్ కంటి పూడి, రాహుల్ రెడ్డి, డైరెక్టర్ : సన్నీ కోమలపాటి.


మరింత సమాచారం తెలుసుకోండి: