ప్రేమికులు కలిసి లంచ్ ల.. డిన్నర్ లు చేయడం పాత ట్రెండ్. సహజీవనం అనేది కూడా రొటీన్ అయిపోయింది. వీటన్నిటినీ మించి తమ మధ్య ఇంకేదో ఉందని చెప్పేందుకు ఆ ప్రేమ జంట ఎప్పుడూ తపిస్తోంది. పెళ్లాడతారా? అంటే నోనో అనేస్తూనే.. తమ ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు. ఏజ్ గ్యాప్ ఉన్నా తమది ఎండ్ లెస్ లవ్ అంటున్నారు. తమ లోకం తమదని.. తమను ఇలానే వదిలెయ్యండని ప్రాధేయపడుతున్నారు. 


మలైకా అరోరా, అర్జున్ కపూర్ల లవ్  ఎఫైర్ బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. అవకాశం దొరకడమే ఆలస్యం తమ కన్నా గొప్ప ప్రేమికులు లేరని ప్రూవ్ చేయడానికి ఈ జంట ప్రయత్నిస్తుంటుంది. లోకం  ఏమనుకున్నా పర్వాలేదు మా లోకం మాదే అన్నట్టు ఉంటుంది ఈ జంట తీరు. భర్తకు అర్బాజ్ ఖాన్ కు విడాకులిచ్చిన మలైకా అరోరా, కుర్రహీరో అర్జున్ కపూర్ తో ప్రేమలోకంలో విహరిస్తుంది. అర్జున్ కపూర్ సైతం ప్రియురాలిపై ప్రేమను ఏమాత్రం దాచుకోకుండా ఓపెన్ అవుతుంటాడు. 


ఆరంభంలో తమ మధ్య కేవలం స్నేహం మాత్రమేనన్న అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇప్పుడు హద్దులు లేకుండా తిరిగేస్తున్నారు. డిన్నర్ పార్టీలు విదేశీ షికార్లు.., బర్త్ డే పార్టీలు అంటూ ఈ లవర్స్ చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. అలా పెళ్లి చేసుకొని కుదురుగా కాపురం పెడతారా అంటే అదీలేదు. కానీ ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇద్దరు ఒకరిపై ఒకరికి ఎంతటి గాఢమైన ప్రేమానుబంధం ఉందనే విషయాన్ని చేతల ద్వారా చూపిస్తారు. ఇపుడు ఈ ముదురు ప్రేమ జంట అలాంటి పనే చేసింది. 


తాజాగా మలైకో అరోరా 46వ బర్త్ డే ప్రియుడి సమక్షంలో ఓ రేంజ్ లో జరిగింది. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు విచ్చేశారు. ఈ వేడుకలో ప్రియురాలు మలైకాతో కలిసి అర్జున్ వేసిన చిందులు మామూలుగా లేవు. ఈ పార్టీలోనే మలైకాను అర్జున్ కపూర్ ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. ప్రేమ ముదిరి పిచ్చిగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రేమలో సిగ్గు విడిచి భయం వదిలేసి ఇప్పటికీ ఈ జంట ఓపెన్ అవుతోందంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: