యంగ్ హీరో నితిన్ దాదాపు రెండేళ్ళ నుండి మంచి హిట్ పడక సతమతమవుతున్నాడు. అ..ఆ తర్వాత మళ్ళీ హిట్ ఇంతవరకు రానేలేదు. లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం..ఇలా వరుసగా మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి మళ్ళీ ఫాం లోకి రావాలని ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ యంగ్ హీరో. అందుకనే ఆచి తూచి కథలను ఎంచుకొని ఒక్కొక్కటిగా  సెట్స్ మీదకు తీసుకు వస్తున్నాడు. అందులో భాగంగా ముందు భీష్మ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక డిసెంబర్ లో పెద్ద సినిమాలతో పాటు కొన్ని మినిమం రేంజ్ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే బాలయ్య-కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రూలర్', వి.ఐ.ఆనంద్ - రవి తేజ కాంబినేషన్ లో వస్తున్న 'డిస్కో రాజా', మారుతి- సాయి తేజ్ ల 'ప్రతి రోజు పండగే' సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. అయితే క్రిస్మస్ కానుకగా రిలీజ్ అంటూ అందరి కంటే ముందే డిసెంబర్లో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 'భీష్మ' మాత్రం ఇంత వరకూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఒకవైపు సినిమా ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ చేస్తున్నారనే అనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా మేకర్స్ నుండి ఎలాంటి అప్‌డేట్ లేదు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. ఓ పక్కా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫాస్ట్ గానే జరుగుతున్నాయి.

అంతేకాదు దీపావళి సందర్భంగా పోస్టర్ వదిలినా అందులో రిలీజ్ డేట్ మాత్రం మెన్షన్ చేయలేదు. ఇక సినిమా డిసెంబర్ కి రావడం పక్కనా లేదా అందరూ ఊహిస్తున్నట్టే ఫిబ్రవరి కి వెళ్లే ఛాన్స్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కొంతమంది పెద్ద సినిమాలతో పోటీ పడకపోవడం మంచిదనే ఉద్దేశ్యంతో ఉన్నారా అని అనుకుంటున్నారట. ఇక మరికొంతమంది నితిన్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టి పోటీలో దిగడం అవసరమా అని ఆలోచనలో ఉన్నారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: