బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ వీక్ కు వచ్చింది.. టాప్ 5 లిస్ట్ లో ఊహించిన వారు కొందరు ఊహించని వారు ఒకరిద్దరు వచ్చారు. ప్రస్తుతం శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, అలి రెజాలు టాప్ 5 స్థానంలో ఇంట్లో ఉన్నారు. అయితే ఈ వీక్ వారికి వచ్చే ఓటింగ్స్ ను బట్టి టైటిల్ విజేతని ప్రకటిస్తారు. 


అయితే టాప్ 5 లో ఉన్న ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే రాహుల్ సింగర్ కాబట్టి అతనికి బయట ఉన్న ఫాలోయింగ్ హౌజ్ లోకి వచ్చాక యాడ్ అయ్యింది. ప్రస్తుతం టైటిల్ విన్నర్ గా రాహుల్ కు ఎక్కువ శాతం ఓటింగ్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఇక యాంకర్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. 


ఆమెకు కూడా టైటిల్ గెలిచే ఛాన్సులు ఉన్నాయనిపిస్తుంది. ఇక వరుణ్ సందేష్ కూడా టైటిల్ రేసులో ఉన్నాడు. అయితే వితిక వెళ్లేంతవరకు స్ట్రాంగ్ గా కనిపించిన వరుణ్ ఆమె వెళ్లాక ఎందుకో వెనుకపడ్డాడని అనిపిస్తుంది. ఇక బాబా భాస్కర్ గురించి చెప్పుకుంటే తను కూడా జస్ట్ ఏదో పిలిచారు వచ్చి ఓ రెండు వారాలు ఉండి వెళ్లిపోతా అనుకున్న అతను ఫైనల్ వీక్ వరకు వచ్చాడు.


తమిళ పరిశ్రమకు చెందిన బాబా భాస్కర్ తెలుగు సరిగా రాకున్నా సరే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌజ్ లో సర్వైవ్ అవడం మాత్రం గొప్ప విషయం. ఏదో ఇలా వచ్చి అలా వెళ్దా అన్నట్టుగా వచ్చిన బాబా భాస్కర్ ఫైనల్ వీక్ కు వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడు. టైటిల్ విన్నర్ అయినా కాకున్నా ఇప్పటికే బాబా భాస్కర్ విన్నర్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక మిగిలిన మరో కంటెస్టంట్ అలి రెజా కూడా హౌజ్ లో అన్ని టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇచ్చాడు. అయితే అతని విషయంలో మాత్రం కేవలం రెండు వారాలు బయటకు వెళ్లొచ్చాడు కాబట్టి టైటిల్ గెలిచే అవకాశం లేదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: