తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 కౌంట్ డౌన్ మొదలైంది.  ఇప్పటికే 100 రోజులు పూర్తయ్యాయి. సోమవారం నాడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుమ మంగళవారం నాడు కూడా కంటిన్యూ చేసింది.  ఇంటి స‌భ్యుల‌తో స‌ర‌దాగా మాట్లాడుతూ, జోకులు వేస్తూ వారిలో జోష్‌ని పెంచింది. మొన్నహెడ్ సెట్ చెవిలో పెట్టి ఆమె చెప్పిన పదాలు చెప్పడంలో వరుణ్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. దాంతో ఆయన్ని మొన్న బెస్ట్ ఎంట్రలైనర్ గా సెలెక్ట్ చేశారు. దాంతో వరుణ్ ఒక ఫ్యాన్ తో ఫోన్ లో మాట్లాడే అవకాశం దక్కించుకున్నాడు.  ఓ టాస్క్ లో విజేతగా నిలిచి వరుణ్ కి ఫ్యాన్ తో ఫోన్ కాల్ మాట్లాడే  ఛాన్స్  వచ్చింది.


ఆ తరువాత హౌస్ మేట్స్ అందరికీ వాళ్ల ఫ్యాన్స్ పంపిన ట్వీట్స్ చదివి వినిపించారు. నిజామాబాద్ నుండి ర‌వి అనే వ్య‌క్తి కాల్ చేసి .. వ‌రుణ్‌, మీ ఎనర్జీ త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. వితికా వెళ్లినందున డ‌ల్ అయ్యారా అని ప్ర‌శ్నించాడు. సుమ మీరు ఎక్క‌డి నుండి కాల్ చేస్తున్నారు అని ఫ్యాన్‌ని ప్ర‌శ్నించ‌గా, తాను నిజామాబాద్ అని చెప్పాడు. దాంతో శ్రీముఖి ఒక్కసారే ఖంగుతిన్నది..ఎందుకంటే తాను కూాడా నిజామాబాద్ కి చెందిన అమ్మాయే.  ఆ తర్వాత ఇంటి స‌భ్యుల‌కి ఫ్యాన్స్ పంపిన మెసేజ్‌ల‌ని చ‌దివి వినిపించారు. వ‌రుణ్‌తో పాటు మిగ‌తా స‌భ్యులంద‌రు త‌మకి వ‌చ్చిన మెసేజ్‌ల‌ని చ‌ద‌వ‌గా, కొంద‌రు తిడుతూ పొగిడారు. ఊస‌ర‌వెల్లి అని, న‌క్క అని కూడా వారు త‌మ ట్వీట్స్‌లో పొందుప‌ర‌చారు. 


ఈ క్రమంలో శ్రీముఖి జెండర్ కార్డ్ వాడుతుందని, చెత్త కంటెస్టెంట్ అని, కన్నింగ్ అని ట్వీట్స్ రాగా.. శ్రీముఖి వాటికి క్లారిటీ ఇచ్చింది. కొన్ని పాజిటివ్ ట్వీట్స్ రాగా ఆ ట్వీట్స్ చేసిన వారికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. బాబా భాస్కర్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ ట్వీట్స్ తో పాటు నెగెటివ్ ట్వీట్స్ కూడా చదివి వినిపించారు. రాహుల్ గురించి ముందుగా పాజిటివ్ ట్వీట్స్ చదివారు. ఎవరు ఏమన్నా.. నవ్వుతో సమాధానం ఇస్తాడని, చాలా మంది  హృదయాలు గెలుచుకున్నావని కొందరు ట్వీట్స్ వేయగా.. రాహుల్ ని నక్కతో పొలుతూ మరికొందరు ట్వీట్స్ వేశారు. 


కొద్ది సేప‌టి త‌ర్వాత సుమ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక జ‌రుపుకుంది. క్రాక‌ర్స్ కాల్చి ఒక‌రికొరు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకున్నారు. తాను వెళ్ళేముందు ఎవ‌రెవ‌రు ఎలా గేమ్ ఆడుతున్నారు. రానున్న రోజుల‌లో ఎలా ఉండాలి, గేమ్ ఎలా ఆడాలి అనే విష‌యాల‌ని ప‌ర్స‌న‌ల్‌గా పిలిచి చెప్పింది సుమ‌.  


మరింత సమాచారం తెలుసుకోండి: