తెలుగు లో ఇప్పటి వరకు ఎంతో మంది కన్నడ నటులు వచ్చారు..కానీ కొద్ది మంత్రి మాత్రమే మంచి గుర్తిపు తెచ్చుకున్నారు.  అందులో ఒకప్పుడు మెగాస్టార్ కి పలు సినిమాల్లో విలన్ గా నటించిన కన్నడ ప్రభాకర్, తర్వాత ఆ స్థాయిలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉపేంద్ర. ఇటీవల కేజీఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో యష్.  తాజాగా యష్ తన  ఇంట ఆనందాల సంబరాలు జరుపుకుంటున్నారు. 2016లో నటి రాధికా పండిట్‌ ని ప్రేమ వివాహం చేసుకున్న యష్ అప్పటి నుంచి తన రేంజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. 

తాజాగా హీరో యష్ ఇంట్లోకి ఓ బుల్లి వారసుడొచ్చాడు. యష్ సతీమణి రాధికా పండిట్‌ పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చింది. బెంగుళూరులోని ప్రయివేట్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో రాధికాను ఉంచారు. బుధవారం ఉదయం కొడుకు జన్మించినట్లు యష్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.  యష్ దంపతులు తమ రెండో బిడ్డను స్వాగతించారు. తదుపరి వివరాలు అధికారికంగా యష్ వెల్లడిస్తారని మీడియాకు సన్నిహితులు పేర్కొన్నారు.

తమ ఇంట్లోకి వారసుడు రావడంపై కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, యష్ కి ఇప్పటికే ఒక కూతురి జన్మించింది. గత ఏడాది జన్మించిన ఆ పాపకు ఐరా అని పేరు కూడా పెట్టారు. 11 నెలల ఐరాతో యష్ దిగిన స్పెషల్ ఫొటోస్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. రెండు రోజుల క్రితమే దంపతులు తమ కూతురితో జరుపుకొన్న దీపావళీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

తాజాగా యష్ తన చిన్నారి పట్టుకొన్న పసిపాప చేతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలతో ముంచెత్తారు.  ప్రస్తుతం యష్ రెండో బిడ్డకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: