అందరు సన్నగా సన్నజాజి తీగలా ఉండాలని అనుకోరు. ఒకవేళ అలా తయారవ్వాలని ట్రై చేసినా కూడా వారి శరీర తత్వమో ఏమో గాని సన్నబడలేకపోతున్నారు కొందరు స్టార్ హీరోయిన్స్. ముఖ్యంగా బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా, విద్యాబాలన్ ఇద్దరు బొద్దుగుమ్మలే. ఇక అనుష్క, నిత్యామీనన్, నమిత..ఇలా కొంతమంది లావు తగ్గకపోగా జీరో సైజ్ ఎందుకు మేము ఇలా బానే ఉన్నాము కదా..ఏ ఇలా ఉంటే చూడరా అంటు రివర్స్ లో క్వశన్ చేస్తున్నారు. శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా 2010లో వచ్చిన సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సోనాక్షి ముందునుంచి కాస్త లావు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంది . ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. 

బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్న కొద్దీ సోనాక్షికి ఫ్యాన్స్‌తో పాటు ట్రోల్స్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇందుకు కారణం తను లావుగా ఉండటమే. ఓసారి సోనాక్షి అందంగా తయారై చక్కటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోపై కొందరు సూపర్బ్ అని కామెంట్స్ చేస్తే, మరికొందరు మాత్రం 'ఏనుగుకి మేకప్ వేసినట్లుంది' అంటు ఘాటుగా కామెంట్ చేశారు. దాంతో సోనాక్షి బాగా హర్ట్ అయింది. అయితే ఆ తర్వాత ఇలాంటి పిచ్చి కామెంట్స్ ని పట్టించుకోవడం మానేశారు. అయితే సోనాక్షి ఈ మధ్యకాలంలో కాస్త బరువు కూడా తగ్గారు. అయినప్పటికీ తనపై కామెంట్లు చేసే వాళ్ళు మాత్రం తగ్గలేదు. అలాంటివారందరికీ బుద్ధి చెప్పడానికి సోనాక్షి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 

ఇప్పుడు మనం ఏనుగు గురించి మాట్లాడుకుందాం. మీరంతా నన్ను అలాగే ఎగతాళి చేసేవారు కదా. కొన్నేళ్ల పాటు మీరు నా బరువుపై కామెంట్లు చేశారు. కానీ ఎప్పుడూ రియాక్ట్ అవ్వకూడదని అనుకున్నాను. వాళ్ళకిక వేరే పని లేక పక్కవాళ్ళని ఎగతాళి చేస్తుంటారు. ఇదివరకు వాళ్ళ కామెంట్స్‌కు బాగా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు వారు ఓ జోకర్ అయిపోయారు. విని నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేం. 

ఆ తర్వాత నేను 30 కిలోలు బరువు తగ్గాను. అయినా కూడా నాపై కామెంట్లు చేయడం మానలేదు. వాళ్ళ ఖర్మ అని వదిలేశా. ఇండస్ట్రీలోకి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చాను. అలానే తెచ్చుకున్నాను బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలయ్యాను. నా శరీరం గురించి నేను దాచుకోవాల్సింది ఏమీ లేదు. నా నడుం సైజ్, నా బరువు, వగైరా..వగైరా.. ఇవేవీ నేను దాచుకోలేదు. మీకు నచ్చితే చూడండి లేదంటే మానేయండి అంటూ సూటిగా తనని కామెంట్స్ చేస్తున్నవాళ్ళకి క్లాస్ పీకింది సోనాక్షి. 


మరింత సమాచారం తెలుసుకోండి: