ఇటీవల కొద్దికాలంగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న ప్రముఖ షో జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ గా పేరుగాంచిన సుధీర్, మొదట తన జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మొదట్లో కొన్ని మ్యాజిక్ షోలు నిర్వహించి, ఆ తరువాత తన స్నేహితుడి సాయంతో హైదరాబాద్ చేరుకున్న సుధీర్, ఈటీవీలో చేరి, మొదట జబర్దస్త్ లో ఒక సాధారణ వ్యక్తిగా ప్రవేశించి, ఆ తరువాత ఏకంగా ఒక టీమ్ ని నెలకొల్పి, నేడు ఆ షోలో ప్రముఖ యాక్టర్స్ లో ఒకరిగా ఎదిగారు. అలానే ఆ షో ద్వారా యాంకర్ గా ఎంతో పాపులరైన రష్మీ గౌతమ్, ఆ ఇటీవల కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది. యాంకర్ గా నటిగా ఎంతో పేరు సంపాదించిన రష్మీ కి మరియు సుధీర్ కి మధ్య ఏదో సంబంధం ఉందని, 

అలానే వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఇప్పటికే వారిద్దరు సహా మరికొందరు ఆ షో సభ్యులు కూడా ఖండిచినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల వారిద్దరి మధ్య ఏమి లేదని గెటప్ శ్రీను కూడా ఒక లైవ్ చాట్ లో చెప్పడం జరిగింది. ఇకపోతే దాదాపుగా జబర్దస్త్ నటులందరికీ కూడా వీరిద్దరి పెళ్లి విషయమై ఎక్కడికి వెళ్లినా అభిమానులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారట. 

అయితే ఇటీవల జబర్దస్త్ షోకు విచ్చేసిన ప్రేక్షకుల్లో కొందరు ఈ ప్రశ్ననే సాధించగా, పలువురు జబర్దస్త్ నటులు మాట్లాడుతూ, నిజానికి సుధీర్ కి మరియు రష్మీకి మధ్య మీరు అనుకుంటున్న సంబంధం అయితే లేదు. వాళ్లిద్దరూ కూడా మాలానే మంచి ఫ్రెండ్స్, ఇక మీరు
అడుగుతున్న విధంగా వాళ్ళిద్దరికీ పెళ్లి తప్పనిసరిగా జరుగుతుంది. అయితే అది నిజ జీవితంలో మాత్రం కాదు, స్కిట్ ని బట్టి మా షోలోనో, లేక మరేదైనా ప్రోగ్రాం లోనో జరగొచ్చు అంటూ కొంత హాస్యాస్పదంగా చెప్పినట్లు సమాచారం. కావున ఇకనైనా వారిద్దరిపై వస్తున్న ఈ పుకార్లకు ప్రజలందరూ అడ్డుకట్ట వేయాలని తామందరి తరపున కోరుతున్నట్లు తెలిపారట....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: