కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది.  ఈ మూవీ తెలుగు లో ‘విజిల్’ టైటిల్ తో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  తెలుగు లో కూడా విజిల్ మంచి హిట్ టాక్ వచ్చింది.  గ్యాంగ్ వార్, ఫుడ్ బాల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై మొదట్లో వివాదం చెలరేగింది.  ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కుర్చీపై కూర్చున విజయ కాళ్ల వద్ద కత్తులు ఉంటాయి.  దీనిపై మాంసం విక్రకదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కత్తులు తాము ఎంతో పవిత్రంగా చూస్తామని..పూజిస్తామని అవి తమ వృత్తిలో ముఖ్యమైనవని అలాంటి వాటిని కాళ్ల వద్ద ఉంచడం అవమానించినట్లే అని పెద్ద ఎత్తున గొడవ చేశారు.  మొత్తానికి ఈ గొడవ సర్ధుమణిగింది.  తర్వాత బిగిల్ కథ తనదే అంటూ ఓ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ రచ్చ చేశారు. ఇవన్నీ అధిగమించి థియేటర్లలో ‘బిగిల్’ సందడి చేస్తూ కలెక్షన్లలో దూసుకు వెళ్తుంది.  తాజాగా ఈ మూవీపై మరో వివాదం చెలరేగింది.  ఈ మూవీలో  ఓ అమ్మాయి ఆకారాన్ని హేళన చేస్తూ కథానాయకుడు విజయ్ మాట్లాడిన మాటల సన్నివేశాన్ని తొలగించారు.

విజయ్ అలా మాట్లాడడం కథానాయకుడి వ్యూహం. అలా రెచ్చగొడితే వారిలో పట్టుదల పెరుగుతుందని, తద్వారా విజయం సాధించవచ్చనేది హీరో ఆలోచన. కొంత మంది క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు విజయ్ ప్రయత్నిస్తుంటారు...ఈ క్రమంలో ఆ డైలాంగ్ ఇప్పుడు పెద్ద వివాదం అయ్యింది.   అయితే, అమ్మాయి ఆకారంపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. దీంతో ఈ కారణంగా సినిమాపై వ్యతిరేక ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఆ సీన్‌ను తొలగించారు.  దీంతో పాటు మరికొన్ని సీన్లను కూడా కట్‌చేసి బాగా ఎక్కువగా ఉన్న సినిమా నిడివిని తగ్గించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: