బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. ఈ చివరి వారంలో కంటెస్టెంట్లకి మంచి అనుభూతులని పంచే విధంగా బిగ్ బాస్ షో రూపకల్పన చేశాడు. బిగ్ బాస్ లో బుధవారం ఎపిసోడ్ ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇచ్చింది. కంటెస్టెంట్స్ యొక్క బిగ్ బాస్ ప్రయాణాన్ని వీడియో చూపించి మొదటి నుండి ఇప్పతి వరకు గల జ్ఞాపకాలను గుర్తు చేశాడు. ఈ ప్రయాణంలో జరిగిన గొడవలు, నవ్వులు, అల్లర్లు అన్నీ చూసేసరికి కంటెస్ట్ద్ంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.


అయితే నిన్నటి ఎపిసోడ్ లో అందర్నీ బాగా ఆకర్షించిన వీడియో బాబా భాస్కర్ ది. బిగ్ బాస్ బాబా భాస్కర్ ప్రయాణాన్ని పొగుడుతూ అందర్నీ నవ్విస్తున్నారని, అలాగే నన్ను గురువుగారు అని పిలవడం కూడా నాకు బాగా నచ్చిందని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో బాబా భాస్కర్ బిగ్ బాస్ పై తనదైన ముద్ర వేసాడని అర్థం అవుతుంది. బాబా భాస్కర్ వీడియోలో  అతన్ని హౌస్ ఆఫ్ ద ఎంటర్ టైనర్ గా అభివర్ణించారు.


అలాగే ఆ విడియోలో బాబా అందర్నీ నవ్వించడమే కాదు, తాను ఏడ్చిన సందర్భాలు కూడా చూపించారు. ఆ వీడియో చూస్తే బాబా భాస్కర్ ప్రేక్షకులని ఎంతలా నవ్వించాడో అర్థం అవుతుంది. ఆ వీడియోలో బాబా భాస్కర్ చేయనిది లేదు అనేట్టుగా ఉంది. నవ్వించడంతో పాటు హౌస్ లో వంటచేయడం , టాస్క్ లలలో బాగా పర్ఫార్మ్ చేయడం అన్నీ కలగలిపి బాబా భాస్కర్ ని అల్ రౌండర్ గా చూపించారు. ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త అనుభూతికి లోను చేసింది.


ఇక వీడియో అయిపోయిన తర్వాత బాబా భాస్కర్ ఎమోషనల్ కి లోనై కంటతడి పెట్టుకుంటాడు. అలా ఏడుస్తూ " నాకు  ఏడవాలంటే కూడా భయంగా ఉంది. నా ఏడుపుని కూడా ఫేక్ అంటారేమో అని అంటాడు. ఈ ఒక్క మాట ప్రేక్షకుల మనసులని తాకింది. ఈ మాటతో బాబా భాస్కర్ కల్మషం లేని వాడని అర్థం చేసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: