అప్పట్లో కృష్ణ సినిమా తో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి...వరుస విజయాలు అందుకుని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ అమితాబ్ బచ్చన్ అనే టైటిల్ కైవసం చేసుకుని తర్వాత మంచి ఫేమ్ ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లిపోయింది విజయశాంతి. దాదాపు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి మేకప్ కి దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కెసిఆర్ తో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతూ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా రాణిస్తున్నారు.


ఇటువంటి తరుణంలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి కృష్ణ కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వటంతో విజయశాంతి నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పై ఇంట్రెస్టు చూపిస్తున్నారు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు. అయితే అప్పట్లోనే కృష్ణ హీరోగా చేసిన తరుణంలో మహేష్ బాబు తో కూడా విజయశాంతి నటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సినిమా సెట్ లో విజయశాంతి- మహేష్ మధ్య పలకరింపులు గురించి అలాగే అనేక విషయాల గురించి ఇటీవల విజయశాంతి ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా యాంకర్ విజయశాంతికి..చిన్న పిల్లాడుగా మీతో నటించిన మహేష్.. ఇప్పుడు  పెద్ద సూపర్ స్టార్ అయ్యారు... అంత పెద్ద స్టార్ అవుతాడని అప్పట్లో అనుకున్నారా ? ఈ ఛేంజ్ మీకు ఎలా అనిపించింది? అని ప్రశ్నిస్తే.. ``బాబు హీరోగా వస్తున్నప్పుడు చూసి షాకయ్యాను. చిన్నప్పుడు చబ్బీగా అనిపించాడు.


అలాంటిది హీరో అయ్యాడు. మొదటి సినిమా చూడగానే ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవుతాడు అనిపించింది. ఇంతకుముందు ఇంటర్వ్యూలోనూ ఇది చెప్పాను. సచిన్ టెండూల్కర్ ఎంత పెద్ద బ్యాట్స్ మన్ నో ఈ అబ్బాయి అలా అవుతాడు! అని అన్నాను. ఎందుకో ఆరోజు అలా అనిపించింది. ఇప్పుడు అనుకున్నట్టే సూపర్ స్టార్ అయ్యారు`` అని తెలిపారు. మరి మహేష్ బాబు సెట్ లో ఉన్న సమయంలో ఏమని పిలుస్తారు అని విజయశాంతి ప్రశ్నించగా. మేడం లేకపోతే అమ్మ అని పిలుస్తారు తెలిపారు. మరి మీరు మహేష్ బాబు ని ఏమని పిలుస్తారు అని విజయశాంతి నీ ప్రశ్నించగా. పేరు పెట్టి పిలవను. బాబు అని పిలుస్తాను అని సెట్ లో అందరికీ మర్యాద ఇవ్వాలి అది తప్పని సరి అని విజయశాంతి చెప్పుకొచ్చారు. మరియు అదే విధంగా మహేష్ బాబు సెట్ లో అందరితో సరదాగా ఉంటాడు సీనియర్లకు చాలా మర్యాద ఇస్తూ మాట్లాడతారని విజయశాంతి పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: