బిగ్ బాస్ సీజన్ 3 ముగింపుకు వచ్చింది. ఇంకా కేవలం మూడంటే మూడే రోజులు ఈ షో నడుస్తుంది. నాల్గవరోజు మాత్రం టైటిల్ విజేతను ఎనౌన్స్ చేస్తారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3, 15 మంది కంటెస్టంట్స్ తో మొదలైంది. ఫైనల్ వీక్ కు వచ్చే సరికి కేవలం 5 మంది మాత్రమే టాప్ పొజిషన్ లో ఉన్నారు.


టైటిల్ రేసులో రాహుల్, శ్రీముఖిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ అదరగొడుతున్నారు. ఇదిలాఉంటే ఈ సీజన్ ఎలాగు ముగుస్తుంది. మరి బిగ్ బాస్ నాల్గవ సీజన్ హోస్ట్ ఎవరు..? అసలు బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందా అన్న విషయలా మీద డౌట్లు పెరిగిపోయాయి.   


సీజన్ 1 సూపర్ హిట్ అవగా ఆ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. ఇక సీజన్ 1 తో పోల్చుకుంటే కంటెస్టంట్స్ గొడవల పరంగా సీజన్ 2 టాప్ పొజిషన్ లో ఉంది. సెకండ్ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. సీజన్ 1, 2లతో పోల్చుకుంటే సీజన్ 3 పెద్దగా ఎంటర్టైన్ చేసినట్టు అనిపించడం లేదు. 


బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ కాబోతుంది.. ఇక సీజన్ 4కు సంబందించిన విషయాల పై ఇప్పటి నుండే ఆలోచిస్తున్నారు. సీజన్ 4 హోస్ట్ గా ఎవరు చేస్తారు అంటే. మళ్లీ ఎన్.టి.ఆర్ నే ఒప్పించి ఎలాగైనా నాల్గవ సీజన్ హోస్ట్ గా చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక తారక్ కాకుంటే అల్లు అర్జున్ సర్ ప్రైజ్ హోస్ట్ గా కనిపిస్తాడట. తారక్ లేదా అల్లు అర్జున్ లలోనే ఒకరు బిగ్ బాస్ 4 హోస్ట్ ఒకరు అవుతారని లేటెస్ట్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: