బిగ్ బాస్ మూడవ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో టైటిల్ సాధించేది ఎవరో తేలనుంది. రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్ మరియు అలీ గ్రాండ్ ఫైనల్ లో మిగిలిన ఇంటి సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ ప్రకారం రాహుల్ లేదా శ్రీముఖి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈసారి వీరిద్దరిలో ఏవరో ఒకరు టైటిల్ సాధించబోతున్నారని అంతా అనుకుంటున్నారు.


అయితే చిట్ట చివరి వారంలో బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ లను హౌస్ మేట్స్ కి ఇవ్వలేదు. ఇప్పటివరకు వారందరినీ తెగ కష్టపెట్టేశాను అనుకున్నాడేమో కానీ ఈ వారం మొదటినుంచి కేవలం ఎంటర్టైన్మెంట్ వైపే దృష్టి పెట్టాడు బిగ్ బాస్. అందులో భాగంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిపోయిన 12 మంది ఇంటి సభ్యులు మరొకసారి హౌస్ లోకి రానున్నారు. కాబట్టి మొదటి రోజు నుంచి ఉన్న ఇంటి సభ్యులు అంతా మరొక్కసారి ఇంట్లో సందడి చేయబోతున్నారు.


అయితే వీరందరిలో హేమ మాత్రం మిగతా సభ్యులతో కలవడం లేదని సమాచారం. ఇక ఫైనల్ కి మరో మూడు రోజులే ఉండబట్టి అందరు ఇంటి సభ్యులు గురువారం, శుక్రవారం మరియు శనివారం అక్కడే ఉండి చివరికి ఫైనల్ షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ లేదా శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలవబోతున్నారని అందరూ అనుకుంటూ ఉండగా వారికి వరుణ్ సందేశ్ మరియు బాబా భాస్కర్ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి విజేత ఎవరో తెలియాలంటే మీకు నచ్చిన ఇంటి సభ్యుడికి మీరు ఓటు వేసి ఈ ఆదివారం కోసం ఎదురుచూడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: