టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది సూపర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చరణ్, ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ తో హిట్ కొట్టి జాతీయ స్థాయిలో పేరు సంపాదించేలా ప్లాన్స్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్న చరణ్, సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తన వ్యక్తిగత మరియు సినిమా విశేషాలను గురించి నేడు ఒక జాతీయ పత్రికతో స్పెషల్ గా మాట్లాడిన చరణ్

తన తండ్రి మెగాస్టార్ గారికి సైరా నరసింహారెడ్డి వంటి అత్యద్భుతమైన సినిమాని అందించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని, అలానే ఆ సినిమాలో నటించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు అలానే సినిమాని ఎంతో ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ లోని తన అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం ఎంతో కష్టపడుతున్నానని, తనతో పాటు ఎన్టీఆర్ గారు కూడా ఎంతో శ్రమిస్తున్న ఈ సినిమాతో మరొక్కసారి రాజమౌళి గారి ఖ్యాతి మరింతగా గొప్పగా విస్తరించడం ఖాయమని ఆయన అంటున్నారు. 

ఇకపోతే ఈ సినిమాకు ఇటీవల షూటింగ్ సమయంలో కొద్దిపాటి అడ్డంకులు వచ్చిన మాట వాస్తవమేనని, దానివల్ల సినిమా రిలీజ్ తేదీ వాయిదాపడడం ఖాయమనే వార్తలు విపరీతంగా రావడంతో, అందరూ అదే జరుగుతుందని భావిస్తున్నారని, అయితే అటువంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, రాజమౌళి గారు సినిమాను అనుకున్న విధంగా ఎంతో పక్కాగా తీస్తున్నారని, అలానే మొదట అనుకున్నట్లు సినిమా వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ కావడం పక్కా అంటూ షాకింగ్ గా ప్రచారం అవుతున్న వదంతులకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: