భాతీయ చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది తమ విలక్షణ నటనతో మెప్పించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.  అలాంటి వారిలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్ ఒకరు.  ఏ భాషా సినిమా అయినా సరే ఎలాంటి పాత్రలైనా సరే తనదై మార్క్ చాటుకుంటూ వస్తున్నారు ప్రకాశ్ రాజ్.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దారుణమైన ఫలితాన్ని పొందారు.  కొంత కాలంగా ప్రకాశ్ రాజ్ రాజకీయాల ఎన్నో కాంట్రవర్సీ డైలాగ్స్ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. 

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకొని ఆయన ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాజాగా హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలు చేశారంటూ.... అఖిల భారత హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది. ఆయన రామాయణాన్ని అవమానిస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఫిల్మ్‌ చాంబర్‌కు ఫిర్యాదు లేఖను అందించింది.  కన్నడ సినిమాల్లో ఆయనకు అవకాశం ఇవ్వొద్దని కోరారు.

ఒకవేళ తమ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకుండా  ఆయనకు అవకాశాలు కల్పిస్తే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ మద్య ఓ వార్త ఛానెల్ లో ఆయన రామాయణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యూపి ముఖ్యమంత్రి యోగీ ఆదిథ్యనాధ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో రథోత్సవానికి ముంబై నుంచి మోడళ్లను రప్పించి వారి ముఖాలకు రంగులు వేసి సీతారామలక్ష్మణుల వేషాలు వేయించారని అనడంతో హిందువులు ఒక్కసారిగా ప్రకాశ్ రాజ్ పై ఫైర్ అయ్యారు.  ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ మహాసభ ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: