ఈ సంవత్సరంలో ఇప్పటివరకు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ చేసినవి తక్కువ. వాటిలో కూడా ఎక్కువగా ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. యావరేజ్ అని చెప్పుకోదగిన సినిమాలు కూడా లేవనే చెప్పాలి. కాకపోతే చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం అంతే. జనవరిలో రిలీజ్ అయిన రామ్ చరణ్ సినిమా 'వినయ విధేయ రామ' పెద్ద డిజాస్టర్. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి ఫ్లాప్స్ మొదలైయ్యాయి. ఇక సమ్మర్ లో రిలీజ్ అయిన మహేష్ 'మహర్షి' యావరేజ్ మాత్రమే. ఇక ప్రభాస్ 'సాహో' కూడా బ్రేక్ ఈవెన్ కు దూరంలోనే ఆగిపోయింది. చెప్పాలంటే అటు ఫ్లాప్ అనాలా లేక యావరేజ్ అనాలా అన్న పరిస్థితి. సేంటు సేం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' కూడా. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానేలేదు. సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్య.. నాగార్జున.. వెంకటేష్ సినిమాలు రిలీజ్ అయినా ఒక్క వెంకీకి మాత్రమే 'F2'తో హిట్ దక్కింది. ఈ ఒక్క సినిమానే 100 కోట్ల బిజినెస్ చెసింది. ఎన్టీఆర్ రాజమౌళి 'RRR'తో బిజీగా ఉండడంతో వచ్చే ఏడాది వరకూ తారక్ నుండి సినిమా లేదు.

ఇక స్టార్ డైరెక్టర్లు కూడా తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. రాజమౌళి సినిమా కోసం వచ్చే ఏడాదివరకూ ఎదురు చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి కోసం వెయిట్ చేయడంతో కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఈ ఏడాది ఒక్కటి కూడా రాలేదు. ఇక సుకుమార్ 'రంగస్థలం' తర్వాత సినిమా మొదలు పెట్టలేదు. మన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఈ ఏడాది ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ  ఒక విషయం అర్థం అవుతుంది. స్టార్ హీరోలు ఒక సినిమా కంప్లీట్ చేయడానికి సంవత్సరం.. అంతకంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో సగం మంది స్టార్ హీరోల సినిమాలు ప్రతి ఏడాదీ రిలీజ్ కావడం లేదు. ఆ స్టార్ హీరోలతో దర్శకులు లాక్ అవడంతో స్టార్ డైరెక్టర్లదీ అదే పరిస్థితి. రిలీజ్ అయిన మూడు నాలుగు స్టార్ హీరోల సినిమాలలో అన్నీ హిట్ అవతుయాయన్న గ్యారెంటీ కూడా లేదు. 

బాహుబలి నుండి ప్రభాస్ ఒక సినిమాకు దాదాపు రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. మహేష్ బాబు ఒక సినిమా చేయాలంటే ఏడాది నుంచి ఒకటిన్నర సంవత్సరం పడుతోంది. యావరేజ్ మీద చూస్తే మహేష్ నటించిన సినిమాలు ఏడాదికి ఒకటి లెక్కన రిలీజ్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ కూడా ఒక సినిమాకు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం తీసుకుంటారు. వీళ్ళలో ఎన్టీఆర్ కొంత ఫాస్ట్ గా వస్తుంటాడు. బన్నీ ఒక సినిమా కంప్లీట్ చేయడానికి సంవత్సరం పడుతోంది. ఒక్కో సినిమా కంప్లీట్ అవడానికి ఒక్కో హీరో సంవత్సరం పైనే టైం ఎందుకు తీసుకుంటున్నారంటే మాత్రం కంటెంట్ లో క్వాలిటి...మంచి ఔట్ పుట్ కోసమని, అలాగే గ్రాఫిక్స్ వల్ల డిలే అవుతుందని..ఇలా రక రకాల కారణాలు చెబుతున్నారు. ఏదేమైనా ఇలా మన తెలుగు ఇండస్ట్రీలో సక్సస్ రేట్ బాగా తగ్గిపోవడానికి కారణం మాత్రం మన హీరోలే అని చెప్పక తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: