ఎనర్జ్ టిక్  హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ అదే మాస్ ఇమేజ్ ని డబుల్ చేసుకోవడానికి చాలా టైం తీసుకొని కొత్త మేకోవర్ తో రీసెంట్‌గా కొత్త సినిమాని ప్రకటించాడు. ఆయన కథానాయకుడిగా 'రెడ్' అనే సినిమా ఈ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి లాంటి క్లాసిక్ హిట్స్ ని రామ్ కి అందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి డబుల్ అవుతోంది. దర్శకుడు తన శైలికి భిన్నంగా ఆలోచించి చేస్తున్న సినిమా కావడం...రామ్ పక్కా మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతుండటంతో మళ్ళీ హిట్ గ్యారెంటీ అని ఆల్రెడి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. అంతేకాదు ఈ సినిమాలో రామ్ యాటిట్యూడ్ లో స్టైలిష్ అప్రోచ్ క్లాసీ టచ్ ఉంటుందని ఫ్రెష్ అప్‌డేట్.

ఇక రెడ్ సినిమాకి స్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే .. 2019లోనే తమిళంలో రిలీజై విజయం సాధించిన 'తడమ్'కి ఇది రీమేక్ అన్న ప్రచారం సాగుతోంది. సాహో విలన్ అరుణ్ విజయ్ హీరోగా నటించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'తడమ్'. రియల్ లైఫ్ క్రైమ్స్ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కథానాయకుడిని ట్విన్స్ అని అనుమానించి ఇన్వెస్టిగేషన్ చేయడం అనే అంశాలు ప్రేక్షకులకు థ్రిల్ ని కలిగిస్తాయిట. ఐడెంటికల్ ట్విన్స్ అనే కొత్త పాయింట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. బెంజ్ కార్ లో తిరిగే ఒక రియల్టర్ కం అప్పర్ మిడిల్ క్లాస్ కి చెందిన కుర్రాడు సినీజర్నలిస్టుతో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలోనే స్మగ్లర్ల రంగ ప్రవేశంతో హీరో విషయంలో ఏం జరిగింది? అన్నదే సినిమా అని సమాచారం. 

ఇక రెడ్ అనగానే హాలీవుడ్ స్టార్ బ్రూస్ విల్లీస్ నటించిన సినిమా గుర్తుకు వస్తుందని కొందరు అంటున్నారు. అమెరికా సీఐఐ .. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా గన్స్ తో కొన్ని గ్రూప్స్ మధ్య వార్ ప్రేక్షకులను బాగా ఆసక్తి కలిగిస్తుంది. మొత్తానికి కిషోర్ తిరుమల ఎంచుకున్న నేపథ్యం ఏది? అన్నది ఉత్కంఠ పెంచుతోంది. బ్రెయిన్ లో చిప్ అన్న కొత్త కాన్సెప్టుతో ఇస్మార్ట్ శంకర్ లో నటించిన రామ్ మరో ప్రయోగాత్మక స్క్రిప్టునే ఎంచుకున్నాడని అర్థమవుతోంది. ఇక రెడ్ సినిమాని గుడ్ ఫ్రైడే సెలవు లాంగ్ వీకెండ్ చూసుకుని పక్కాగా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా అఫీషియల్ గా 'తడమ్' కి రీమేక్ అయినా గాని హాలీవుడ్ సినిమా చాయలు కనిపిస్తున్నట్లు వార్త ఒకటి బాగా వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: