రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా 'ఆవిరి'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యే వరకు ఈ సినిమాకు సంబంధించిన డిటేల్స్ ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. అంతేకాదు రవిబాబు సినిమాను లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తూ చిత్రీకరించాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. రవిబాబు గత సినిమాల ఫలితాల కారణంగా ఆవిరి సినిమాకు మొదట జనాల్లో ఎక్కువ ఆసక్తి కనిపించలేదు. కాని ఎప్పుడైతే రవిబాబు ఒక ఇంటర్వ్యూలో కలెక్టర్ అమ్రాపాలి పేరు చెప్పాడో అప్పటి నుండి కూడా ఆవిరికి బాగా పబ్లిసిటీ అవుతోంది.

'ఆవిరి' సినిమా పబ్లిసిటీలో భాగంగా 'అదుగో' సినిమా చేస్తున్న సమయంలో వరంగల్ జిల్లా అప్పటి కలెక్టర్ అమ్రాపాలి గారి గురించి ఒక వార్త చూశాడట. ఆమె కలెక్టరేట్ లో దెయ్యం ఉందని అటు వెళ్లేందుకు భయపడుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఆవిరికి కథ రాశాను అంటూ రవిబాబు చాలా క్యాజువల్ గా చెప్పారు. ఆవిరి సినిమాకు అమ్రాపాలి గురించి మీడియాలో వచ్చిన ఒక వార్త కారణం అంటూ ఆయన చెప్పిన ఈ ఒక్క మాట సినిమాకి ఒక్కసారిగా హైప్ ని క్రియోట్ చేసింది. 

దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని కవర్ చేశాయి. వెబ్ మీడియా.. సోషల్ మీడియా.. ప్రింట్ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియా అన్నింట్లో కూడా రవిబాబు 'ఆవిరి' సినిమాకి కలెక్టర్ అమ్రాపాలి ముఖ్య కారణం అంటూ కథనాలు రాసేశారు. దాంతో జనాల్లో కూడా 'ఆవిరి' మీద ఆసక్తి బాగా పెరిగింది. రవిబాబు ఎప్పుడైతే అమ్రపాలి పేరు వాడాడో అప్పటినుంచి 'ఆవిరి' కి మాంచి ఫ్రీ పబ్లిసిటీ దక్కింది. ఇంత పబ్లిసిటీ దక్కించుకున్న ఆవిరి కి రిలీజయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: