తెలుగులో ఈమధ్య టాలెంటెడ్ డైరక్టర్స్ ఎక్కువమంది వస్తున్నారు. దర్శకుడిగా తాము చెప్పాలనుకున్న పాయింట్ ను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. అయితే లవ్ స్టోరీలు ఎన్ని వచ్చినా వాటితో కొత్తగా ట్రై చేస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. మొదటి సినిమా నిన్ను కోరితో ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో సినిమా తీసి హిట్ కొట్టాడు.


ఇక ఈ ఇయర్ నాగ చైతన్యతో చేసిన మజిలీ కూడా సూపర్ హిట్ అయ్యింది. మజిలీ హిట్ లో సమంత భాగం కూడా ఉందని తెలుస్తుంది. రియల్ లైఫ్ భార్యాభర్తలను రీల్ లైఫ్ లో ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక మూడవ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు శివ నిర్వాణ. 


అసలైతే నానికి ఓ కథ చెప్పగా అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదై ఇవ్వలేదట. అందుకే నాని కోసం వెయిట్ చేయకుండా విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ  విషయాని విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమ ప్రమోషన్స్ లో చెప్పాడు విజయ్ దేవరకొండ.


నానికి అనుకున్న కథనే నాని కాదని చెప్పడంతో విజయ్ దేవరకొండ కోసం క్యారక్టరైజేషన్ మార్చి రాశాడట. కుదిరితే నాని లేదంటే విజయ్ అన్నట్టుగా ఉంది నేటి దర్శకుల పనితీరు. మరి నానికి అనుకున్న కథ విజయ్ కు సెట్ అవుతుందా అన్నది చూడాలి. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరితో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఆ తర్వాత సినిమా శివ నిర్వాణతో ఉంటుందని టాక్. మరి విజయ్ శివ నిర్వాణ కాంబోలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: