టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫ్యాషన్ గా ఉంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే టాలీవుడ్ లో ఆయన్ని స్టైలిష్ స్టార్ అంటారు. డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్, కామెడీ ఏదైనా తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న అల్లు అర్జున్ తాను కోరుకున్న అమ్మాయి స్నేహారెడ్డిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.  రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నిజంగా హీరో అనిపించుకున్నాడు.  అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంటకు అయాన్, అర్హలు జన్మించారు. 

అయితే గతంలో అయాన్ కి సంబంధించిన ఎన్నో స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్ని ఇప్పుడు తన కూతురు సంతోషాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ అభిమానాన్ని పొందుతున్నాడు.  తాజాగా యన్, అర్హా స్టార్ హిరో అల్లు అర్జున్ పిల్లలు.. విచిత్ర వేషాలు వేశారు ఏంటి అని చూస్తున్నారా.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు జరుపుకుని పండుగను ఈ చిన్నారులు జరుపుకుంటున్నారు.  గత కొంత కాలంగా  సినీ సెలబ్రెటీలు ఈ ఫెస్టివల్ ని ఇండియాలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 

ముఖ్యంగా మెగా  కుటుంబం కొన్ని సంవత్సరాల నుంచి హాలోవీన్ వేడుకలు జరుపుకుంటుంది.   అల్లు అయాన్ తన హాలోవీన్ దుస్తులలో గ్రీన్ కలర్ స్కిల్ అవతార్‌ను ఆడుతుండగా.., అల్లు అర్హా ప్రకాశవంతమైన మంత్రగత్తుల్లా ఉండే దుస్తువులు ధరించింది. కాగా, హాలోవీన్ అంటే దయ్యాల పండుగ అని అర్ధం ఇది 1846లో ఐర్లాండు పట్టింది.

కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఔ ప్రజలు ఈ కొత్త సంప్రదాయాన్ని పరిచయం చేశారు.  ఈ పండగను సాంహైన్ పండుగ అని కూడా పిలుస్తుంటారు. ప్రజలు వేసిన పంటలు ముగింపు కాలం సందర్భంగా ఈ వేడుక ప్రపంచమంతా పాకింది. ఆల్ హలో ఈవెనింగ్ అనే పదం నుంచి ఈ హాలోవిన్ పుట్టిందని అంటారు. తాజాగా అల్లు అర్జున్ చిచ్చర పిడుగులు వేసిన దయ్యం వేశాలు..అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
 
view this post on Instagram

#happyhalloween #2019

A post shared by allu sneha Reddy (@allusnehareddy) on

మరింత సమాచారం తెలుసుకోండి: