టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఒక సాదాసీదా హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్  స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తో టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చిన విజయ్... మొదటి సినిమాలోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు చిత్రపరిశ్రమలోనే ఒక నూతన శకాన్ని ఆరంభించాడు విజయ్ దేవరకొండ. కనివిని ఎరుగని రీతిలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్  విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్బులో చేరిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత టాక్సీవాలా తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. 




 అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ రేంజ్  ఒక్కసారిగా మారిపోయింది. దీంతో   ఒక స్టార్ హీరో రేంజ్  ఫేమస్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీ యూత్ లో విజయ్ దేవరకొండకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను  తీసుకొచ్చింది. అందుకే విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే  యువత వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వరల్డ్  ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. 



 ఇక ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతున్నాయి. కాగా  విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. కాగా టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా లో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్  తో కనిపించనున్నాడని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆహార నియమాలు కూడా పాటిస్తు... గట్టిగానే కసరత్తులు చేస్తున్నానని  విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పారు. ఇక ఈ ఫైటర్ సినిమాని తన ఫ్యాన్స్ అర్జున్ రెడ్డి సినిమా కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు  అంటూ చెప్పుకొచ్చారు. దర్శకుడు పూరి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మరింత క్రేజ్ ని పెంచడం కోసం విజయ్ సరసన  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ డేట్స్ కోసం దర్శకుడు పూరిజగన్నాథ్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: