ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఆ సినిమా కాకా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'ఫైటర్ ' అనే మూవీతో విజయ్ దేవరకొండ చాలా బిజీగా ఉన్నారు. మొదట్లో విజయ్ నటించిన సినిమాలు అంతగా హిట్ అవకపోయిన, అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ అతని ఫ్యాన్ ఫాల్లోవింగ్ ఏ మాత్రం తగ్గడంలేదు. అతని రీసెంట్ సినిమా డియ‌ర్ కామ్రేడ్ ఓవర్సీస్ లో కూడా ప్రేష్కకుల ఆదరణ పొందింది. తన స్టామినా తో ఏ సినిమానేనా బ్లాక్బస్టర్ చేయగల విజయ్ కి బాగా ఆఫర్స్ రావడంలో అతిశయోక్తిలేదు. 


ఫైటర్ సినిమా షూటింగ్ జనవరి, 2020 లో ప్రారంభంకానుంది. మే నెలలో విడుదలవ్వనుంది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ని చాలా కొత్తగా చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ విపరీతంగా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. దానితో పాటు, విజయ్ ఆరోగ్యమేనా ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటున్నట్లు సమాచారం. 


పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ తో కలిసి ఫైటర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. అందాలతార శ్రీదేవి కూతురు అయినా జాన్హవి కపూర్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈ మూవీ లో, ఇంకో హీరోయిన్ కోసం పూరి వేటలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబందించిన ఇతర యాక్టర్స్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. 


ఇక విజయ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో లో బైకర్ గా కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ సినిమా నిజమైన సంఘటన ఆధారంగా తీస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో 'వరల్డ్ ఫేమస్ లవర్ 'తెరపైకేక్కనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: