15 వారాలుగా స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి ఘట్టానికి చేరుకుంది. 15 మంది కంటెస్టంట్స్, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మొత్తం 17 మంది ఇంటి సభ్యులలో కేవలం ఐదుగురు మాత్రమే టాప్ 5 కి చేరుకున్నారు. అయితే వారిలో టైటిల్ విజేత అయ్యేది మాత్రం ఒక్కరే.


బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని తెలుస్తుంది. సింగర్ గా పాపులర్ అయిన రాహుల్ ప్రైవేట్ ఆల్బంస్ తో కూడా సత్తా చాటాడు. అందుకే అతనంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక శ్రీముఖి అన్నా కూడా బుల్లితెర ఆడియెన్స్ కు చాలా ఇష్టం.


తన అల్లరి యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ ఫైనల్ రేసులో ఉన్న శ్రీముఖి కచ్చితంగా టైటిల్ తనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం రాహుల్ సిప్లిగంజ్ కే బిగ్ బాస్ టైటిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.


రాహుల్ ఫాలోవర్స్ వర్సెస్ శ్రీముఖి ఫ్యాన్స్ ఇలా సోషల్ మీడియాలో వీరిద్దరి విజయం కోసం పెద్ద కొట్లాటే జరుగుతుంది. అయితే శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలిచినా తెలవకపోయినా పెద్దగా తేడా ఉండదు. కాని కేవలం ఒక సింగర్ గా మాత్రమే పేరు తెచ్చుకున్న రాహుల్ బిగ్ బాస్ టైటిల్ కొట్టడం మాత్రం మాములు విషయం కాదని చెప్పొచ్చు. రిపోర్ట్స్ అన్ని రాహులే బిగ్ బాస్ విన్నర్ అని చెబుతున్నాయి. మరి అసలు విన్నర్ ఎవరన్నది ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది. అయితే విన్నర్ ఎవరైనా సరే ఫైనల్ ఎపిసోడ్ మాత్రం సూపర్ సక్సెస్ అయినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: