తెలుగు సినీ రంగంలో తిరుగులేని హీరోయిన్ ఎవరేనా ఉన్నారంటే అది కేవలం సమంత అక్కినేని అని నిసందేహంగా చెపొచ్చు. తన మొదటి సినిమా 'ఏం మాయ చేసావే ' నుంచి మొన్న వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా వరకు అన్ని మంచి విజయం సాధించాయి. ‘ఓ బేబీ’ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. అసలు సమంత వస్తున్నారంటే అందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి. 


తన క్రేజ్ని అప్పటికపుడు పెంచుకొనే సమంత, సామజిక మాధ్యమాలలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాషన్ క్వీన్ గా పేరు పొందిన సమంత అక్కినేని, తరచుగా తన నూతన ఫాషన్ డ్రెస్సెస్ తో అందరి హృదయాలను దోచుకుంటుంది. ఏ సందర్భంలోనేనా సమంత అక్కినేని ఎంచుకొనే లుక్స్ కేక పెటిస్తాయి. 


ఇటీవలే తన రాబోయే సినిమా '96' షూటింగ్ పూర్తికావడంతో, సమంత అక్కినేని తన స్టైలిష్ ఫోటో ని ఇంస్టాగ్రాం అకౌంట్ లో షేర్ చేసారు. 'నాకు విరామం దొరికింది, మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నా,' అని ఆ ఫోటో కి ఒక కాప్షన్ రాసింది. ప్రస్తుతం, శర్వానంద్ సరసన సమంత అక్కినేని తమిళ్ రీమేక్ అయినా '96'సినిమాలో నటిస్తుంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాని దిల్ రాజు తెరపైకెక్కిస్తున్నాడు. 


ఈ మధ్య కాలంలో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మాన్'. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యే ఈ వెబ్ సిరీస్ లో సమంత అక్కినేని ఒక కీలక పాత్ర లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్లో లో బాగా అలరించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ ' ఈసారి సమంత నటనతో మరింత క్రేజ్ ని సంపాదించడానికి రెండొవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: