బుల్లితెర పైన తన యాంకరింగ్ తో, అందచందాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను బాగా అలరించే రష్మీ గౌతమ్ సినిమాలలో ఎపుడో అరంగేట్రం చేసారు. కానీ తను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఏ ఒక్క పాత్ర తనకి పేరు తెచ్చిపెట్టలేదు. ఎందుకంటే ఆమె కి వచ్చే సినీ పాత్రలు అన్ని ఎక్సపోసింగ్ చేసావే. నిజానికి తను నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం తన అందాల ఆరబోతతోనే విజయం సాధించిందని పేరొచ్చింది. 


తన నటన ప్రతిభని నిరూపించుకోవడానికి తను ఎంత ప్రయత్నించినా ఎవరు ఒక్కటి అంటే ఒక్క ఛాలెంజింగ్ పాత్ర‌ కూడా ఆఫర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగూ మంచి పాత్ర‌లు రావడంలేదని అందుకే ఏ పాత్ర వచ్చిన కేవలం డబ్బు సంపాదించడానికి చేస్తున్నానని చెప్పారు. తనలో ఒక బ్యూటీ ని మాత్రమే చూస్తున్నారని, నటనను ఏ దర్శకడు గుర్తించకపోవడం ఆమె దురదుష్టం అని వాపోయారు. 


తను మంచి సినిమాలు చేయాలన్నా తపనతో ఉన్నపటికీ ఆ ఛాన్సెస్ రాకపోతే నేనేం చేయాలి? అని ప్రశ్నించారు. కనీసం వెబ్ సిరీస్ లోనేనా నటించి ఒక మంచి కళాకారునిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తునని ఆమె చెప్పారు. ఎలాగేతేనేం తను కేవలం తన బ్యాంకు బాలన్స్ ని పెంచుకోవడం కోసమే సినిమాలు చేస్తున్నాని నిజాయితీగా చెప్పిన రష్మీ ని అందరూ పొగుడుతున్నారు. 


ఇది కాకా తను జంతులపై చూపించే ప్రేమ అందరి మనసులని గెలుచుకుంటుంది. ఒక కుక్కని కిటికీ నుంచి వేలాడ తీసి కొడుతున్న యజమానిని మందలించి ఆ కుక్క ని రష్మీ గౌతమ్ కాపాడారు. ఈ విషయాన్నీ తను ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఎవరేనా జంతువులని హింసించడం చూస్తే అలాగే వదిలేకండి యాక్షన్ తీసుకోండి అంటూ తన ఫాలోయర్స్ ని కోరింది ఈ ముద్దుగుమ్మ రష్మిక గౌతమ్.


మరింత సమాచారం తెలుసుకోండి: