బాలీవుడ్ క్వీన్ దీపిక పడుకొనే ఎటువంటి పాత్రనేనా అలవోకగా చేయగలరు. ఇప్పటికే బాజీరావు మస్తానీలో తను చేసిన నటన దేశవ్యాప్తంగా ప్రశంశలను అందుకుంది. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ కూడా దీపిక పడుకొనే అద్భుతమైన నటనను మెచ్చుకున్నాడు. పద్మవాత్ సినిమాలో తన నటనతో ఎందరినో అలరించిన ఈ బాలీవుడ్ అందాలతార, అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి ' హిందీ రీమేక్ లో నటించపోతున్నారని సమాచారం. 


మొదటిగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అరుంధతి రీమేక్ చేస్తుందని వార్తలు వచ్చాయి. తర్వాత కరీనా కపూర్ పేరు వినిపించినా, దీపిక నే ఈ సినిమా చేయబోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ ని కొన్నదని సమాచారం. ఈ సినిమా బెంగాలీలో కూడా రీమేక్ అయ్యి బాగా విజయం సాధించిన విషయం తెలిసిందే. 


2009 లో రిలీజ్ అయినా అరుంధతి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా డబ్బులు బాగా వసూలు చేసింది. ఈ సినిమా లో నటించిన తర్వాత అనుష్క శెట్టి కి విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. 


ఈ మధ్య కాలంలో దీపిక పడుకొనే ఆసిడ్ దాడి బాధితురాలైన లక్ష్మి అగర్వాల్‌ జీవిత ఆధారంగా తీసిన చఫాక్‌ మూవీ షూటింగ్ ని పూర్తిచేసింది. అన్ని పాత్రలలో ఈ ఆసిడ్ దాడి బాధితురాలి పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉందని తను మీడియా సమావేశాలలో చెప్పారు. తన ప్రేక్షకులు లే కాదు అందరూ చఫాక్‌ సినిమాలోని దీపిక నటనను చూడాలని ఉవ్విళూరుతున్నారు. కానీ ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలవునుంది. ఇంకా తను మహాభారతం గురించి తీసే సినిమాలో ద్రౌపది పాత్ర లో నటించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: